NewsOrbit
Featured బిగ్ స్టోరీ

Tirupathi By Election; 2017 నంద్యాల – 2021 తిరుపతి..! ఈ నిజాలు జగన్ – చంద్రబాబు ఇద్దరూ గ్రహించాల్సిందే..!!

Tirupathi By Elections; Nandyal - Jagan - chandrababu Variations

Tirupathi By Election; అది 2017 .. నంద్యాల శాసనసభ ఉప ఎన్నిక.. అధికారంలో టీడీపీ, ప్రతిపక్షంలో వైసీపీ.. 2014 లో అక్కడ గెలిచింది వైసీపీ జెండాతో భూమా నాగిరెడ్డి. కానీ ఆయన టీడీపీలోకి జంపయ్యారు. ఆ తర్వాత మరణించారు. అందుకే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. నైతికంగా అది వైసీపీ స్థానం, కానీ రాజకీయంగా టీడీపీ స్థానం. అందుకే ఉప ఎన్నిక చాలా హోరాహోరీగా జరిగింది. అంతకు ముందు మూడు ఎన్నికల్లో అక్కడ టీడీపీ గుర్తు గెలవలేదు. నిజానికి అక్కడ టీడీపీ పునాదులు కూడా గట్టిగా లేవు. అటువంటి చోట అధికార బలంతో.., యంత్రాంగం తోడుగా తన పార్టీ బలగంతో చంద్రబాబు అక్కడ పోటీ పెట్టారు. పోటీ పోటీ, హోరాహోరీ అనుకున్న ఎన్నిక కాస్త ఫలితాల్లో టీడీపీకి ఫుల్ మెజారిటీ దక్కింది. 27365 ఓట్లు ఆధిక్యతతో టీడీపీ గెలిచింది.

Tirupathi By Elections; Nandyal - Tirupathi Jagan - chandrababu Variations
Tirupathi By Elections; Nandyal – Tirupathi Jagan – chandrababu Variations

Tirupathi By Election; జగన్ అసాధారణ పోరాటం..!

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నంద్యాల ఉప ఎన్నికల్లో అసాధారణ పోరాటం చేసింది. ప్రతిపక్ష హోదాలో జగన్ చాలా శ్రమ పడ్డారు. అభ్యర్థి తరపున బాగా ప్రచారం చేశారు. వైసీపీ కీలక నేతలు కూడా అక్కడే తిష్ట వేశారు. ముస్లిమ్ ఓటర్లు, రెడ్డి సామాజికవర్గం ఓట్లు కలిసి వస్తాయి.. 2014 లో ఇది తమ సీటే కాబట్టి కచ్చితంగా గెలుస్తామని వైసీపీ ధీమాతో ఉంది. కానీ మామూలుగానే చంద్రబాబు రాజకీయంలో దిట్ట. అధికారంలో చేతిలో ఉంటె అస్సలు ఆగే టైపు కాదు. అందుకే చంద్రబాబు కూడా అధికార యంత్రాంగాన్ని, పోలీసులను, టీడీపీ ఇతర జిల్లాల నేతలను, 15 మంది ఎమ్మెల్యేలను, ఆరుగురు మంత్రులను రంగంలోకి దించారు. అయినా జగన్ వెనకడుగు వేయలేదు. ప్రచారంలో చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. తనను చూసి ఓటెయ్యాలంటూ అభ్యర్థించారు. చివరికి అధికారమే గెలిచింది. డబ్బు మంత్రం బాగా పని చేసింది. తమది కానీ స్థానాన్ని టీడీపీ భారీ మెజారిటీతో గెలిచింది. ఇక్కడితో సీన్ కట్ చేస్తే…. తిరుపతిలో ఇప్పుడు…

Tirupathi By Elections; Nandyal - Tirupathi Jagan - chandrababu Variations
Tirupathi By Elections; Nandyal – Tirupathi Jagan – chandrababu Variations

Tirupathi By Election; అధికారం మారింది – పోరాటం మారింది..!! 

2017 నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి జగన్ ని మానసికంగా మొండిగా, బలంగా చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి కంటే, ఈ ఓటమిని జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. “వాళ్ళ టైం వచ్చింది. కొట్టారు. కాశాము. కానీ మా టైం వస్తుంది. చాల గట్టిగా కొడతాం” అంటూ సంచల వ్యాఖ్యలు చేసారు. ఇవి అప్పట్లో సాధారణ వ్యాఖ్యలుగానే ఉన్నాయి. కానీ 2019 లో టీడీపీ ఓడిన తర్వాత ఈ వ్యాఖ్యల్లో అంతరార్ధం చంద్రబాబుకి అర్ధమయింది. ఇప్పుడు తిరుపతి టైం వచ్చింది. నాటి టీడీపీ పాత్రలోకి నేడు వైసీపీ వచ్చింది. నాటి వైసీపీ పాత్రలోకి నేటి టీడీపీ వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. సేమ్ అధికారాన్ని, యంత్రాంగాన్ని, పోలీసుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని తిరుపతిలోకి దించారు. చంద్రబాబు కూడా ఎక్కడ తగ్గకుండా తన బలగం ఎమ్మెల్యేలు, కీలక నేతలు మొత్తాన్ని తిరుపతిలో దించేశారు. ఇది టీడీపీ సీటు కాదు. ఇక్కడ టీడీపీకి బలమూ లేదు. కానీ పోరాటం చేస్తుంది. చాలా లోతుగా పోరాటానికి దిగుతుంది.

Tirupathi By Elections; Nandyal - Tirupathi Jagan - chandrababu Variations
Tirupathi By Elections; Nandyal – Tirupathi Jagan – chandrababu Variations

ఇద్దరిలో తేడా ఏంటి..!? అధికార ముసుగు – ప్రతిపక్ష లొసుగు..!!

ఆ నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. డబ్బుని వెదచల్లారు. అనధికార లెక్క ప్రకారం ఆ ఎన్నికల్లో టీడీపీ దాదాపు రూ. 80 కోట్లు వరకు ఖర్చు చేసింది. వైసీపీ రూ. 40 కోట్లు వరకు చేసింది. బలం, సెంటిమెంట్, జగన్ చరిష్మా అక్కడ ఓడిపోయాయి. ఇప్పుడు జగన్ టైం వచ్చింది. తిరుపతి అంటే చంద్రబాబు సొంత జిల్లా. చంద్రబాబుకి సెంటిమెంట్ ఉన్న ప్రాంతం. ప్రస్తుతం అక్కడ టీడీపీ బలంగా లేకపోవచ్చు కానీ.., దశాబ్దాల తరబడి అక్కడ టీడీపీ స్ట్రాంగ్ పునాది వేసుకుంది. ఆ పునాదుల సాక్షిగా, సెంటిమెంట్ రగిల్చి.., ప్రభుత్వ వ్యతిరేకత కాంక్షించి గెలవాలని అనుకుంటుంది. ఇక్కడ జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. టీడీపీకి అవకాశం ఇవ్వడం లేదు. అధికార దుర్వినియోగానికి వెనుకాడం లేదు. డబ్బుకి జంకడం లేదు. ఆల్రెడీ ఎక్కడెక్కడ, ఎంత అనే లెక్కలు కూడా ఖరారు చేసుకున్నారు. రెండు పార్టీలు భారీగానే ప్రచారం, ప్రలోభ ప్రణాళికలతో ఉన్నాయి. సో.. తేడా ఏం లేదు. రాజకీయం, పోరాటం, ప్రచారం, ప్రలోభం దేనిలోనూ ఎవ్వరూ తగ్గడం లేదు..!!

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju