NewsOrbit
Featured బిగ్ స్టోరీ

హతవిధీ…!! పాపం “పీకే”కి ఎంత ఖర్మ పట్టిందీ…!

మోడీని పీఎంని చేయడంలో కీలక పాత్ర పోషించాడు…!
చంద్రబాబుని దించడంలో జగన్ కి సాయపడ్డాడు. ఏపీలో ముద్ర వేసాడు..!
కేజ్రీవాల్ ని రెండో సారి గెలిపించి… ఢిల్లీ స్థాయిలోనూ చక్రం తిప్పాడు…!
మమత పిలిస్తే వెళ్లి ఇరుక్కున్నాడు..! పాపం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదిగిన ఆయనకు మమత పరీక్ష పెద్దదిగా మారింది. బాబుని ఓడించినంత సులువు కాదు మమతని గెలిపించడం అని ఇప్పుడిప్పుడే తెలుస్తుందట మన పీకే అలియాస్ “ప్రశాంత్ కిషోర్” కి… ఆ విషయమేమిటో, అతని కష్టమేమిటో చూద్దాం పదండి..!!

పీకే ఇప్పుడు ఎక్కడున్నారంటే..?

ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఉన్నారు. ఏపీలో జగన్ ని సీఎం చేసిన తర్వాత ఢిల్లీ వెళ్లి… అక్కడ కేజ్రీవాల్ ని గెలిపించి… ఆ తర్వాత నేరుగా కోల్కటా వెళ్లారు. అక్కడ మమతని మళ్ళీ సీఎం ని చేసే ప్యాకేజీ కుదుర్చుకున్నారు. ఏపీ రాజకీయం వేరు.. కులాలకు, సెంటిమెంటులకు, డబ్బులకు, రంగులకు లొంగుతుంది..! ఢిల్లీ రాజకీయం వేరు మతానికి, చదువుకి, కొంత మేరకు జ్ఞానానికి లొంగుతుంది…! కానీ బెంగాల్ అలా కాదు. ఓ పట్టాన దేనికి లొంగదు. మొండి నాయకులుంటారు. ఘటాలుగా కూర్చుంటారు. కులాలు, మతాలు, డబ్బు అన్నా లొంగని వాళ్ళుంటారు. అలాంటి చోట పీకే చిక్కుకున్నారు.

 

ఆయనకు తాజాగా వచ్చిన కష్టం ఏమిటంటే…??

పీకే ప్రధాన లక్ష్యం తృణమూల్ పార్టీని గెలిపించడం. ఇది జరగాలి అంటే ఆ పార్టీకి పోటీగా ఉన్న సిపిఎం, బీజేపీలు బలహీనమవ్వాలి. అంటే జిల్లాల వారీగా ఆ పార్టీల్లో బలమైన నాయకులను గుర్తించి తృణమూల్ లోకి లాగెయ్యాలి. ఆ క్రమంలో పీకేకి కష్టాలొస్తున్నాయి. పీకే టీమ్ సభ్యులకు, వారి మాటలకు లొంగని నాయకులకు నేరుగా పీకేనే మాట్లాడుతున్నారు. ప్యాకేజీలు, పదవులు ఆఫర్ చేస్తున్నారట..! కానీ నో యూజ్..! ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే…!!

lakshmi kantha roy EX MLA
* పశ్చిమ బెంగాల్ లోని ఝాల్పైగురి జిల్లాలోని దుప్గురి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇక్కడ “రాయ్” కుటుంబానికి ఓట్లు దండిగా ఉన్నాయి. జిల్లాలోనూ వారికి పట్టుంది. వారిసగా పది ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తున్నారు. సిపిఎం తరపున వరుసగా ఎనిమిది ఎన్నికల్లో ఇక్కడ ఆ కుటుంబ అభ్యర్థులు గెలిచారు. వారిలో బలీయంగా ఉన్న నేత “లక్ష్మి కాంత రాయ్” సిపిఎం నాయకుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసారు. సదా సీదా జీవనం. మొత్తం ఆస్తులు 4 లక్షలు మాత్రమే. చిన్న పూరిళ్ళులో ఉంటున్నారు. ఈయనను తృణమూల్ లోకి ఆహ్వానించే క్రమంలో పీకేకి చెమటలు పడుతున్నాయట. ఎంత ఇచ్చినా లొంగకపోవడంతో విషయాన్నీ మమతకు చేర్చారట. ఆమె “మీరు ఏం చేస్తారో తెలియదు ఆయన చేరాలి, లేదా…!! అంటూ ఆర్డర్ వేశారు. ఇంకేముంది పీకే అదే ప్రయత్నంలో మళ్ళీ పడ్డారు.

ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే…!?

పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి బీజేపీ, తృణమూల్ కి అత్యంత కీలకమైన ఎన్నికలు. మమత రాజకీయ జీవితం దీనితో ముడిపడి ఉంది. ఆమె వరుసగా రెండు సార్లు సీఎం గా ఉన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. అందుకే ఈమెను ఓడిస్తే బీజేపీకి ప్రాంతీయ శత్రువులు లేనట్టే అనే భావనలో బీజేపీ నాయకత్వం ఉంది. ఈసారి పకడ్బందీగా బీజేపీ రంగంలోకి దిగుతుంది. కేంద్రంలో హవా, వ్యవస్థలతో పాటూ తమ స్టైల్ రాజకీయం నడిపిస్తుంది. మరోవైపు సిపిఎం కూడా ఉనికి కోసం గట్టి పోటీ ఇస్తుండడంతో మమతకు చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే బీజేపీని ధీ కొట్టే క్రమంలో సిపిఎంలో బలంగా ఉన్న నేతలను మమత పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ దశలోనే పీకేకి చుక్కలు, రెక్కలు కనిపిస్తున్నాయి.

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju