NewsOrbit
Featured బిగ్ స్టోరీ

అటు బీజేపీ… ఇటు వైసీపీ పక్కా స్కెచ్..!! చంద్రబాబుకు 70MM సినిమా..!!

YS Jagan: Can Control Central upto 2024

ఏదైనా ఒక స్టోరీకి ముగింపు ఉంటేనే అందులో థ్రిల్ ఉంటుంది. మజా ఉంటుంది. లేదంటే ఆ సాగదీతకు అర్థం ఉండదు. పరమార్థం అంతకంటే ఉండదు. ఏపీ రాజకీయాల్లో గాలి పోగేసి గేమ్ ప్లే చేయాలని చూస్తున్న ఆ పార్టీకి భవిష్యత్‎లో 70 MM సినిమా చూపించేందుకు రంగం సిద్ధమైపోయిందట. కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లి చూడటం ఉండదు కదా… అందుకే ఇళ్లలోనే వర్చ్యువల్ రియాల్టీలో సినిమా చూపించే స్కెచ్ ఇంప్లిమెంట్ అవుతోందట. అవును మీరు వింటున్నది నిజమే… ఆ సినిమాకు పేరు, డైలాగులు, పాత్రలు ఏమీ ఉండవు. జస్ట్ స్ట్రీన్ ప్లే, డైరక్షన్ మాత్రమే ఉంటుంది. ఆ సినిమా ఏంటంటే… తెలుగు తమ్ముళ్లు పూర్తి స్థాయిలో బీజేపీలో విలీనం కావడమే… పక్కా కార్పొరేట్ సంస్థకు దీటుగా ఉండే తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టడం, ఏమైనా చేయడం అంత వీజీ అయ్యే పని కాదు… కానీ అందుకు స్కెచ్ వేసి ఇంప్లిమెంట్ చేస్తే తప్పించి…

 BJP, YCP is a perfect sketch, 70MM movie for Chandrababu!!
modi, jagan

ఆ ఆలోచన అటు వైసీపీ-ఇటు బీజేపీ అగ్రనాయకత్వానికి వచ్చిందట. అది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో ఏమో గానీ… గతంలోనూ ఇలాంటి ప్రతిపాదన ఒకటి వచ్చిందట. అయితే అది వర్కౌట్ కాలేదు. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని బ్రహ్మానందాలు తెలుగు నేలపై గల్లీకొకరున్నారు. అవును ఎందుకంటే అందులో తిక్క లేదు. లాజిక్కు మాత్రమే ఉంది. టీడీపీలో ఉన్న పెద్దల సభ సభ్యులంతా కషాయం తాగి, పువ్వు పార్టీ జెండాలతో దర్శనమిస్తే తెలుగు జనమంతా ఇదేం విడ్డూరమో అనుకున్నారు గానీ… ఎవరూ పెద్దగా ఆ అంశాన్ని చర్చించుకోలేదు. ఎందుకంటే ఒక మీడియాకు అది పెద్ద విషయం కాదు. అది అసలు తప్పే కాదు. ఎందుకంటే దాని వెనుక కర్త, కర్మ, క్రియ 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి. అందుకోసం మీడియా, కార్పొరేట్ లాబీయింగ్ కూడా ఒక రేంజ్‎లో ప్లాన్ చేసింది. అందుకే పువ్వు పార్టీ వాళ్లు కూడా జరిగేదేదో చూద్దాం… కానివ్వండి అనుకున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు, లాంఛనంగా బీజేపీలో విలీనమవగా… ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు మాత్రమే మిగిలారు.

 BJP, YCP is a perfect sketch, 70MM movie for Chandrababu!!
tdp rajya sabha members join bjp

ఇక రెండో స్పాట్ చూద్దాం. టీడీపీకి లోక్‎సభలో ముగ్గురు సభ్యులున్నారు. ముగ్గురిది మూడు రకాల విలక్షణత. ఒకరు టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉననట్టున్నప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా అధినేత చేసే కార్యక్రమాల్లో లోటుపాట్లను వేలెత్తి చూపిస్తుంటారు. ఆయనకు ఢిల్లీలో కొందరు బీజేపీ పెద్దలతో పరిచయాలు కూడా ఉన్నాయ్. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీని వీడి కమలం పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా చెబుతున్నారు. లోకేశ్ యాక్షన్‎కు బీజేపీలోకి వెళ్లడమే తన రియాక్షన్ అంటూ పార్టీ గల్లా పట్టుకొని మరీ జయదేవ్ రంగం సిద్ధం చేసుకున్నారట. ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు… సందర్భం చూసి కాషాయం తీర్థం పుచ్చుకునే అవకాశముందంటున్నారు. మొత్తంగా ముగ్గురు ఎంపీలు బీజేపీలో విలీనమవుతానంటే అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో.. టీడీపీ ఎంపీలు రాజ్యసభలో చేరినప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే సైలెంట్ అయిపోతారా… ? లేక ప్రజాస్వామ్యం… విలువలు అంటారా?

 BJP, YCP is a perfect sketch, 70MM movie for Chandrababu!!
tdp loksabha mps with chandra babu

ముల్లును ముల్లుతోనే తీసే ఓ రేంజ్ గేమ్ స్క్రీన్ ప్లే పనులు చకచకా సాగిపోతున్నాయ్ మొన్న రాజ్యసభ… రేపోమాపో లోక్‎సభ… ఆ తర్వాత ఇక మిగిలింది శాసనసభే… అవును ఇది ఎప్పుడో జరగాల్సి ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ నేతలు… టీడీపీకి సరెండర్ అయిపోయారన్న వార్తల నడము ఆ ఎపిసోడ్‎కి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కొత్త సారధి రంగంలోకి దిగాక… ఫిరాయింపులకు వేళ అయినట్టుగా భావించాల్సి వస్తోంది. మూడు రాజధానుల విషయంలో కేంద్రం, వైసీపీ సర్కారుకు బాసటగా నిలుస్తోంది. టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలన్నది ఇద్దరి ఎజెండా. అది నేను చేస్తే ఏంటి? నువ్వు చేస్తే ఏంటి? ప్లాన్ అమలు కావాలి అంతే. టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నాడు వైసీపీ ఎమ్మెల్యేలను వేటాడి.. టీడీపీలోకి లాక్కున్న తరహా రాజకీయాలకు భిన్నంగా జగన్ రాజకీయం చేయబోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను నేరుగా వైసీపీలోకి తీసుకోలేరు. అదే సమయంలో వారితో రాజీనామాలు చేయించలేరు. అలాంటప్పుడు వారందరూ బీజేపీలో విలీనం కథ నడిపితే… అందుకు వైసీపీ పెద్దలు సాయపడితే… వామ్మో స్క్రీన్ ప్లే ఓ రేంజ్‎లో రాసినట్టేకదా…

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju