NewsOrbit
Featured బిగ్ స్టోరీ

చంద్రబాబు టీమ్ కీలక వికెట్ పడినట్టే..! వైసీపీలోకి మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి…! …!!

టీడీపీలో ఓ కీలక ఎమ్మెల్యే పార్టీని వీడనున్నారు…! ఆ పార్టీ ఓడినప్పటి నుండి సైలెంట్ అయిపోయిన ఆయన.. అధికారంలోకి దూకేయ్యడానికి సరైన సందు చూసుకుంటూ వస్తున్నారు. ఇటీవల అధికార పార్టీ ఒత్తిళ్లు, తన అనుచరులపై కేసులు ఎక్కువవ్వయ్యాయనే సాకుతో ఇక టీడీపీ నుండి వైసిపిలోకి జంపవ్వడానికి ముహూర్తం సిద్ధం చేసేసుకున్నట్టు సమాచారం. ఇంతకూ ఎవరీయన, ఆయన రాజకీయ నైజం ఏంటి..? అనేది చూద్దాం..!

అధికార “గంట” కొట్టడమే పని…!!

ఏపీ రాజకీయాల్లో గంట శ్రీనివాసరావుది ప్రత్యేక నైజం. పార్టీలు, నియోజకవర్గాలు, కండువాలు, రంగులు, జనమూ అనే ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉండవు. అధికారంలో ఎవరుంటే వారికి జై కొట్టడం.., తన పనులు జరిపించుకోవడం… సందు చూసుకుని వ్యవహరించడమే ఆయన శైలి. తాజాగా గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరిపోవడానికి నిర్ణయం తీసుకున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగష్టు 15 న ఆయన జగన్ పంచన చేరిపోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే పూర్తిగా కాదు సుమీ…! ఇప్పటివరకు పార్టీలు మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు తరహాలోనే సాంకేతికంగా టీడీపీతో ఉన్నట్టే.., కానీ పార్టీ, మనిషి మాత్రం వైసిపిలో ఉన్నట్టు. వైసిపి కండువా వేసుకోరు, కానీ టీడీపీ కి దూరమవుతారు. జగన్ తో దోస్తీ చేస్తారు, చంద్రబాబుని తిడతారు. ఆగష్టు 15 ఇళ్ల పట్టాలు పంపిణీ వేదికగా ఈ మార్పు జరగనుంది.

 

మొదటి నుండి అంతే…!

గంట శ్రీనివాసరావు ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో పెద్ద గొప్ప నాయకుడైతే కాదు. ఎందుకంటే వరుసగా ఒక నియోజకవర్గంలో గెలవలేదు. వరుసగా ఒక పార్టీ తరపున పోటీ చేయలేదు. కాకపోతే ఆయన అంటే ఒక బలం, బలగం ఉంటుంది. ఆయన రాజకీయం, నైజం, లాబీయింగులు, చీకటి కోణాలు చాలానే ఉంటాయి. అవన్నీ అధికార పార్టీకి అవసరం. 2009 కి ముందు వరకు టీడీపీ లో ఉంటూ.., 2009 లో ప్రజారాజ్యంలో చేరినా.., 2012 లో కాంగ్రెస్ కి చేరి మంత్రి అయినా.., 2014 లో టీడీపీ లో చేరి మళ్ళీ మంత్రి పదవి చేపట్టినా.., ఇప్పుడు తాజాగా వైసిపిలో చేరినా పెద్దగా ఆశ్చర్యకరం ఏమి కాదు. ఆయన గురించి బాగా తెలిసిన వారు గంటా ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉండడమే ఆశ్చర్యకరం అంటుంటారు. ఓ సారి ఎంపీగా, ఓ సారి భీమిలి నుండి, ఓ సారి అనకాపల్లి నుండి, మరోసారి విశాఖ ఉత్తర నుండి… ఇలా నియోజకవర్గాలు మారుకుంటూ కొన్ని చీకటి రాజకీయాలు చేసుకుంటూ గెలుచుకుని, రాజకీయ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.

మంత్రి అవంతి పరిస్థితి ఏమిటో…!

ఇప్పుడు గంట చేరికపై మొదటగా అడ్డుకునేది మంత్రి అవంతి శ్రీనివాసరావు మాత్రమే. ఎందుకంటే టీడీపీలో గంటా హవా తట్టుకోలేక, జిల్లాలో పార్టీలో ఆయన డామినేషన్ జీర్ణించుకోలేక వైసిపిలో చేరారు. గెలిచారు, మంత్రయ్యారు. ఇప్పుడు గంటా మళ్ళీ వైసిపికి వస్తే ఊరకే ఉండరు. తన వ్యవహారాల్లో కచ్చితంగా వేలు పెడతారు. గంటా చతురతకి, చాణక్యతకి అధికారులు కూడా గంటాకు గంట కొడతారు. ఇప్పటికే జిల్లాలో విజయసాయిరెడ్డి నీడలో తాను ఉన్నానంటూ లోలోపల రగిలిపోతున్న అవంతి కి ఈ నిర్ణయం మరింతగా చేదు వార్తా. తన హవా తగ్గడం ఖాయం. అందుకే గంటాని తీసుకోవద్దు అంటూ.., గంటా చేసిన వ్యాఖ్యలు, గతంలో జగన్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు అన్నిటినీ విజయసాయి ద్వారానే జగన్ కి చేరవేసినట్టు సమాచారం. కానీ జగన్ నుండి మాత్రం గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju