NewsOrbit
బిగ్ స్టోరీ

అయోధ్య శంకుస్థాపన దుర్ముహూర్తంలోనా?

అంగరంగ వైభవంగా అయోధ్య రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు ఓవైపు చకచకా జరుగుతుంటే…

మరికొందరు మాత్రం లేనిపోని విమర్శలు, అర్థంలేని మాటలతో మొత్తం కార్యక్రమంపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. రామునికి గుడి కట్టాలని దశాబ్దాలుగా యావత్ హిందూ జాతి తపిస్తుంటే… ఇప్పటికీ కొందరు సూడో సెక్యులరిస్టులు దుర్మార్గాలకు తెరదీస్తూనే ఉన్నారు. తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం సరైన సమయంలో చేయడం లేదంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయ్. రేపు శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలంటూ ఇప్పటికే డిగ్గీ రాజా యూపీ సీఎం యోగికి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. కరోనా సమయమంటూ భౌతిక దూరం అవసరమంటూ చెప్పిన దిగ్విజయ్ మూహూర్తబలం సైతం సరిగా లేదంటూ వాదిస్తున్నారు.

అయితే రామమందిర శంకుస్థాపనకు రేపు దివ్యమైన మూహర్తమని తేల్చేశారు జ్యోతిష్యులు. ముహూర్తం అనేది అనేక విషయాల సమాహారమని అయోధ్యలోని రామాలయ మందిర శంకుస్థాపన ముహూర్తానికి వంద పాయింట్లలో 95 శాతం వరకు సానూకలత వ్యక్తమవుతుందని… ఇలాంటివి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటూ వారు చెబుతున్నారు. రెండు మూడు పాయింట్లు ప్రతికూలత చూపించినందువల్ల వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది వారి అభిప్రాయం. శంకుస్థాపన ముహూర్తం వాయిదా వేసుకోవాలని కొందరు చెబుతున్న లెక్కలు సవ్యమైనవి కావని… రేపు దుర్ముహూర్త ప్రభావం అసలే లేదంటున్నారు.

ఇక ముహూర్త సమయంలో చంద్రుడు బలంగా ఉంటే నక్షత్ర రీత్యాగానీ, వార జనిత దుర్ముహూర్త దోషాలను హరిపంజేస్తాడని తేల్చిచెబుతున్నారు. ముహూర్తానికి చంద్రుడు దశమాధిపతి అవడంతోపాటు పంచమంలో బలంగా ఉన్నాడని….అందువల్ల వారజనిత దుర్మూర్తం పటాపంచలైపోతుందని స్పష్టం చేస్తున్నారు. బుధవారం శతభిష నక్షత్రానికి అమృతయోగం, సిద్ధ యోగం రెండూ ఉండటం గొప్ప విషయమంటున్నారు. ఏదో ఒక యోగం, సిద్ధయోగమో, అమృత యోగమో సాధారణంగా సంభవిస్తాయని… రెండూ అరుదుగా లభిస్తాయంటున్నారు. రామమందిర శంకుస్థాపన ముహూర్తం అత్యంత దివ్యమైన సమయంలో నిర్దేశించారని… వారజనిత దుర్మూహర్త ప్రభావం అసలే ఉండదంటున్నారు.

 

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju