NewsOrbit
బిగ్ స్టోరీ

బాబుగారు సూపర్…

జగన్‎ను టార్గెట్ చేసి పాయింట్ భలే పట్టుకున్నారు…

సామ,భేద,దాన, దండోపాయాలు వినియోగించడంలో నారా వారి స్టైలే సెపరేట్. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడం, వైసీపీ ఓడిపోవడం వెనుక బాబుగారు అస్త్రాలు అన్ని వదిలారు.జగన్మోహన్ రెడ్డి బలాలను బలహీనతలుగా మార్చడం… తనకు అనుకూలంగా ఉన్నవాటిని జనంలోకి తీసుకెళ్లే మీడియాతో నేలవిడిచి సాము చేసిన బాబుగారు అప్పుడు విజయం సాధించారు. అయితే తొమ్మిదేళ్ల బాబు పాలన, ఐదేళ్ల బాబు పాలనతో కంపేర్ చేసిన జనాలు ఆయనను ఛీకొట్టారు.

 

అయితే ఆయన మాత్రం జగన్ పాలన గురించి రోజూ ఫిర్యాదులే చేస్తారు. ఎక్కడా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి సర్కారును వదలరు. పైపెచ్చు అవినీతి అక్రమాలలో అరెస్టైన టీడీపీ నేతలను హీరోలుగా చిత్రీకరిస్తూ వారికి పూర్తి సంఘీభావం తెలుపుతారు. ఇక్కడ సబ్జెక్ట్ ఇది కాదు కానీ అసలు విషయానికి వస్తాం… ప్రతిపక్షనేత చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఒక అస్త్రం విసిరారు.

అదేంటంటే… ఏపీలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతుంటే… సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాస్క్ పెట్టుకోకుంటే ఎలా అంటూ విమర్శలు గుప్పించారు. సీఎం అసమర్థత వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డే మాస్కు పెట్టుకోకుంటే జరిమానా విధించండం ఎంత వరకు సమంజసమన్నది బాబుగారి లాజిక్….ఏపీలో టెస్టులు ఎక్కువ చేస్తే చాలా పనికిరాకుండా పోయాయంటూ ఒక మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తాయ్. వాస్తవానికి కరోనా అప్రమత్తతతో అప్పటికప్పుడు కష్టానికి దన్నుగా నిలవాలన్న అభిప్రాయం ఎవరికైనా ఉంటుంది. అధికారులు, వాలంటీర్లు తప్పులు చేసి ఉండొచ్చు. దేశ వ్యాప్తంగా కరోనాకు మందు మాస్క్, భౌతిక దూరం, చేతులు కడుక్కోవడం ఎలాగో… టెస్టింగ్ కూడా అలాగే… అలాంటి కరోనా విషయంలో విమర్శలు గుప్పించడాన్ని ఎవరూ విమర్శించరు. మంచిని మంచిగా… చెడును చెడుగా చెబితే సరిపోతుంది. కానీ ఇక్కడ తమకు నచ్చని విషయం దేన్నైనా చెడుగా చిత్రీకరించి… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలన్న వర్షన్ జనాలకు అంతగా నచ్చదు.

వాస్తవానికి కరోనా నివారణకు మాస్క్ వాడాల్సిందేనంటూ ప్రభుత్వాలు జరిమానా అస్త్రాలను వదిలాయ్. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాస్క్ పెట్టుకోవడం లేదని… దాన్ని అందరూ పాటిస్తున్నారని రేపోమాపో టీడీపీ నేతలు ఒక పెద్ద విమర్శగా జనంలోకి తెచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. వంట చేసేవారికి ఏ కూరలిచ్చినా… తనకు నచ్చిన వంటే చేసే అలవాటు ఎలా ఉంటుందో… టీడీపీ వారికి కూడా అంతే… దేన్ని విమర్శించాలనుకున్నా అందుకు తగిన విధంగా వ్యాఖ్యానాలు చేసే టీం, మీడియా మేనేజ్మెంట్ రెండూ కూడా సిద్ధంగా ఉంటాయి కదా…

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju