NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Narendra Modi ; చంద్రబాబుకీ – మోడీకి అదే తేడా..! “ఓటుకి నోటు” అమల్లో తేడా చూసారా..!?

Narendra-modi-cbn-vs-narendra-modi-note-for-vote

Narendra Modi ; ప్రవేశపెట్టిన కొత్త ఓటుకి నోటు విధానం. పాపం ఇది తెలియక Chandrababu చంద్రబాబు ఎన్ని తిప్పలు పడ్డాడో..! “ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థికి ఓటేయాలి. అందుకు రూ. 5 కోట్లు ఇస్తాం. అడ్వాన్స్ గా ఈ రూ. 50 లక్షలు తీసుకో… (దే బ్రిఫ్డ్ మీ. ఐ విల్ హ్యాండిల్)” ఇవన్నీ చూస్తుంటే Chandrababu Naidu  చంద్రబాబు “ఓటుకి నోటు” కేసు గుర్తుకి వస్తుంది. తెలుగు నాట రాజకీయాల్ని ఖరీదుగా మార్చి, ఓటు – నోటు ఒకే కోవకి చెందినవి అని గుర్తించిన నేత చంద్రబాబు.. అదే సూత్రంతో, అదే ఫార్ములాతో 2019 లో చంద్రబాబుని దెబ్బ కొట్టింది YS Jagan జగన్. దీనిలో ఏ మాత్రం తిరుగులేదు, అనుమానం లేదు..!

కానీ.. చంద్రబాబు “ఓటుకి నోటు” కేసు పిచ్చిది. ఓటు కోసం డబ్బులిస్తూ దొరికిపోవడం ఏమిటి..!? పక్కాగా ప్లాన్ చేసుకుంటే.., చాకచక్యంగా వ్యవహారం నడిపిస్తే ఈ పాటికి ఈ “ఓటుకి నోటు” అంశమే ఉండేది కాదు..! ఈ రిస్కులన్నీ ఎందుకు అనుకున్నారేమో బీజేపీ – ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కాస్త కొత్తగా ఈ ఓటుకి నోటు విధానాన్ని అమలు చేస్తున్నారు. పక్కాగా, ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం దేశం మొత్తం మీద “రాజ్యాంగ బద్ధంగానే ఓటుకి నోటు” విధానాన్ని అమల్లోకి తెచ్చేసారు..!!

ఇదీ చదవండి ; ఈ రాజ్యాంగం ఎవరు రాశారు..!? బీజేపీ దెబ్బ..!!

Narendra-modi-cbn-vs-narendra-modi-note-for-vote
Narendra-modi-cbn-vs-narendra-modi-note-for-vote

Narendra Modi ; మోడీ మార్కు మ్యాజిక్..!

“ఏపీకి కేంద్రం నిధులివ్వలేదు, నిధులివ్వలేదు.. బడ్జెట్ లో అన్యాయం చేసింది” అని ఏడ్చే కంటే.., బీజేపీకి ఓటు వేయట్లేదు కాబట్టి కేంద్రం నిధులివ్వడం లేదు.., ఏపీలో బీజేపీ అనే పార్టీకి చోటు లేదు కాబట్టి.. బీజేపీకి ఏపీ అనే రాష్ట్రం కనిపించడం లేదు… అనే చిన్న లాజిక్కు మర్చిపోతే ఎలా..!? ఆ లాజిక్కుకి తోడుగా చంద్రబాబు, జగన్ వంటి నేతలు పెద్దగా ప్రశ్నించకపోవడం.., తమ ఆశీస్సుల కోసం జపం చేస్తుండడం… బీజేపీకి మరో బోనస్ కూడా… అందుకే లాజిక్కులు, బోనస్ లు బాగా తెలిసిన మోడీ మ్యాజిక్ చేస్తూ ఏపీకి తన మ్యాజిక్ షో చూపిస్తుంటారు. సో.. ఈ బడ్జెట్ ఒక్కటే కాదు.., ఇలా మరో వంద బడ్జెట్ లు వచ్చినా ఏపీకి ఏమీ ఉండదు. ఇంకా సింపుల్ గా అర్ధమయ్యేలా చెప్పుకోవాలి అంటే “పెళ్లి కుదిరితేనే.. రోగం తగ్గుతుంది” అని డాక్టర్ చెప్తే.., రోగం తగ్గితేనే.. పెళ్లి కుదురుతుంది అని బంధువులు చెప్పారట.. సో.., రోగం తగ్గదు, పెళ్లి కుదరదు..! ఈ లెక్కన ఏపీలో బీజేపీకి ఓట్లు వస్తేనే నిధుల్లో ప్రాధాన్యత ఇద్దాము అనుకుని బీజేపీ పెద్దలు భావిస్తుంటే.., బీజేపీ మనకు నిధులిస్తేనే మనం ఆ పార్టీకి ఓట్లు వేద్దాం అనుకుని ఏపీ ఓటర్లు ఉన్నారేమో.. ఈ ఓటు గొడవలో అన్యాయంగా ఇరుక్కున్నది ఏపీ మాత్రమే..!!

ఇదీ చదవండి ; తప్పులు ఎవరివి..? జగన్ కి మూల్యం ఎందుకు..!?

Narendra-modi-cbn-vs-narendra-modi-note-for-vote
Narendra-modi-cbn-vs-narendra-modi-note-for-vote

Note for Vote ; రెండింటికి ఇదే కీలక తేడా..!?

మోడీ సొంత రాష్ట్రం గుజరాత్. అమిత్ షాకి కూడా సొంత రాష్ట్రం గుజరాతే..! అక్కడ ప్రత్యేకంగా ఇవ్వాల్సినవి అంటూ ఏమీ లేవు. గడిచిన ఏడేళ్లలో సుమారుగా రూ. 10 లక్షల కోట్లతో ఆ రాష్ట్రంలో ప్రగతి పారింది. ఇప్పుడు బీజేపీ దృష్టి మొత్తం “ఎన్నికల రాష్ట్రాలపై” మాత్రమే. అందుకే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి… ఆ రాష్ట్రాలకు నిధుల్లో ప్రాధాన్యత దక్కింది. “ఓటు వేయండి బాబు అంటూ దొంగచాటుగా నోట్లు ఇస్తేనే ఓటుకి నోటు కాదు.., ఓట్లు ఉన్నాయి కాబట్టి నిధులు ఇస్తాం.., ఓట్లు వేయడం లేదు కాబట్టి నిధులు ఇవ్వబోము అనేది కూడా ఓటుకి నోటు తరహానే. కాకపోతే మొదటిది క్రైమ్.., రెండోది బీజేపీ అమలు చేస్తున్న చట్టం. అందుకే ఏపీకి ఏడేళ్లుగా ఏమీ లేవు. ఇవ్వమని గట్టిగా అడగరు, అడిగినా ఇవ్వరు..!!

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju