NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

‘శ్రీశైలం’ నిజాలు దాస్తున్నారా ? లైట్ తీసుకోమని ప్రజలకి చెబుతున్నారా ?

నీటి ప్రాజెక్టుల విషయంలో…. కాలువల విషయంలో ప్రభుత్వం వైఖరి ఎప్పుడూ కొంచెం అటు ఇటు గా ఉంటుంది. కానీ విమర్శలు వచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా ఇలా అడ్డంగా మాట్లాడితే అలాంటి వారిని ఏమనాలి??

 

ఎంతెంత నిర్లక్ష్యం…?

“కాలేశ్వరం కాల్వలకు అప్పుడే గండ్లు పడుతున్నాయి” అనే వార్తలకు…. విమర్శకులకు…. ” గండ్లు కాల్వలకు కాకపోతే మరి వేటికి పడతాయి” అని ఒక వెటకారపు, వెక్కిరింపు సమాధానం వచ్చింది సదరు తెలంగాణ మంత్రి నుండి. శ్రీశైలం ప్లాంట్ ప్రమాదంపై తెలంగాణ పవర్ చీఫ్ ప్రభాకర్ రావు స్పందన కూడా ఇలాగే ఉంది. పవర్ ప్లాంట్ ప్రమాదాలు కొత్తేమీ కాదు…. యుపి ఎన్టీఫీసీలో లో బాయిలర్ పేలి 30 మంది చచ్చిపోలేదా? తమిళనాడులో ఇలాంటివి జరగలేదా అని అంటున్నారు. ఇలాంటి వ్యక్తా మన పవర్ బాస్? ఇది ఆయన స్పందన తీరు..! అసలు ఆయన ఒక ఇంజనీరె కాదు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఉత్పత్తిని… పంపిణీ కూడా ఆయన నిర్దేశిస్తాడు. ఆయన స్పందన కూడా అచ్చు అలానే ఉంది. అవగాహనా శూన్యత

వెనకున్న ధైర్యం ఎవరు?

అసలు ఇదంతా పక్కన పెడితే… ప్రభుత్వమే సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. వాళ్లు పర్యటిస్తున్న సమయంలో అర్జెంట్ గా ఒక అంతర్గత కమిటీ వేసి…. అందులో తమ వాళ్లందరినీ పోగు చేసుకుని…. మీడియా ని పిలిపించుకొని ప్రమాదాలు కొత్తేమీ కాదు ఏ రాష్ట్రంలోనూ ఎవడూ పరిహారాలు ఇవ్వలేదు… మేము కాబట్టి ఇస్తున్నామని వ్యాఖ్యలు అసలు ఎలా చేస్తారు? ఇది పూర్తిగా అధికార బాధ్యతారాహిత్యం వ్యాఖ్యలు తప్ప మరి ఏమిటి? ఒక రాజకీయ నాయకుడు ఇంతటి అనాలోచిత వ్యాఖ్యలు చేయడం వెనుక అతని ధైర్యం ఏమై ఉంటుంది?

విపక్షానికి ఒక దణ్ణం బాబు..!

ఇక అధికార పక్షం వైఖరి వదిలేస్తే ప్రతిపక్షాలు మరింత దరిద్రంగా ఉన్నాయి. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి దీన్ని జగన్ శ్రీశైలం జల దోపిడీకి ముడిపెట్టి ఏదేదో మాట్లాడేసి…. ఇందులో కేసీఆర్ దొంగనాటకం ఉందని… కేంద్రం కచ్చితంగా కలగచేసుకోవాలి అని అంటున్నాడు. ఎవరికీ ముక్క కూడా అర్ధం కాలేదు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ – జగన్ భాగస్వాములు అనడమ్ వరకు ఒక రకం. కానీ ఆ ప్రాజెక్టు కోసం విద్యుత్ ప్లాంట్లో కావాలని ప్రమాదం క్రియేట్ చేశారు అనడం ఎంతటి మూర్ఖత్వము ఆయనకే తెలియాలి.

కాబట్టి చివరికి ఎవరైనా చెప్పొచ్చేది ఏమిటంటే… ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం నుండి కాని…. విపక్షాల నుండి గాని అందుకు సంబంధించి రెస్పాన్స్ కు ఎదురుచూడకూడదు. అంటే… అందులో నిజాలు బయట పడకపోగా ఇది చాలా సర్వసాధారణం…. రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు.. అక్కడ ఎంతో మంది చనిపోయారు…. కానీ మేము మాత్రమే చనిపోయిన వారికి మేలు చేస్తున్నాం అని అసమర్థత మాటలు వినవలసి వస్తుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా కరోనా లాగే అనివార్యం అన్నట్లు ఫిక్స్ అయిపోయి తమ జీవితాలను, కాలాన్ని ముందుకు వెళ్ళదీయడం మంచిది.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?