NewsOrbit
బిగ్ స్టోరీ

విజయమ్మ రాసిన పుస్తకం నో స్టాక్…అందులో అసలు ఏముంది..!

 

తొలి ఎడిషన్ మొదటి రోజే మొత్తం అమ్మకం

ఇంగ్లీషులో అనువాదానికి పెంగ్విన్ సిద్దం

నాలో..నాతో..వైయస్సార్ ఈ టైటిల్ ఇప్పుడు వైయస్సార్ ఫ్యాన్ ను ఊపేస్తోంది. వైసీపీ అభిమానులు..కార్యకర్తలే కాదు రాజకీయంగా ఆసక్తి ఉన్న వారు ఇప్పుడు ఈ టైటిల్ తో వచ్చిన పుస్తకం పైన ఆసక్తి చూపిస్తు న్నారు.

ఈ నెల 8న దివంగత వైయస్సార్ జన్మదినం నాడు ఆయన సతీమణి విజయమ్మ రచించిన ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ రచన ను ఎమెస్కో పబ్లికేష్స్ ప్రచురించి మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే, తొలి రోజే ప్రచురణలు మొత్తం అమ్మడయ్యాయి. ఇది తెలుగు పుస్తకాల్లో రికార్డు అని చెబుతున్నారు. ఆనలైన్ విక్రయాల్లోనూ టాప్ స్థాయిలో ఉంది. దీంతో..ఇప్పుడు ఈ తెలుగు రచనను ఆంగ్లంలో అనువదించటానికి పెంగ్విన్ పబ్లికేషన్స్ ముందుకొచ్చింది. అయితే, ఇంతగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్న ఈ పుస్తకంలో అసలు విజయమ్మ ఏ విషయాలు ప్రస్తావించారు.. ఆ పుస్తకానికి ఎందుకు ఇంత డిమాండ్ ఉందనే ఉత్సుకత ఆ పుస్తకం అమ్మకాలను ..రేటింగ్ ను మరింతగా పెంచుతోంది.

వైయస్సార్ గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత..

దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ముఖ్యమంత్రి హోదాలోనే ఉండగా..రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరి 2009, సెప్టెంబర్ 2న నల్వకాల్వ వద్ద జరిగిన హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత వైయస్సార్ కుటుంబంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. జగన్ కాంగ్రెస్ పార్టీ వీడటం…తన తండ్రి హాయంలో అక్రమాస్తులు కూడ బెట్టారంటూ సీబీఐ కేసులు నమోదు.. వైసీపీ ఏర్పాటు..ప్రతిపక్ష్ నేతగా ప్రపయాణం..సుదీర్ఘ పాదయాత్ర..ముఖ్యమంత్రి అవ్వటం…ఇలా..ఈ విషయాలు ప్రస్తుతం వైసీపీ అభిమానులు..నేటి తరం నేతలకు తెలిసిన విషయాలే. అయితే, అసలు వైయస్సార్ గురించి..ఆయన రాజకీయ జీవితం గురించి పూర్తిగా తెలిసిన వారు కొందరే. ప్రస్తుతం వైసీపీ కేడర్ లో సైతం వైయస్సార్ పాలన గురించి చూసిన వాళ్లు..విన్న వాళ్లు ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ విజయమ్మ తన భర్త గురించి రాసిన పుస్తకంలో ఇంకా ఎటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు…వైయస్సార్ ఏ రకంగా ఉండేవారు అనేది తెలుసుకోవటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో..విజయమ్మ రచించిన నాలో.. నాతో..వైయస్సార్ కు ఊహించని విధంగా ఆదరణ కనిపిస్తోంది. ఇడుపుల పాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. జగన్ సోదరి షర్మిళ సైతం తన తల్లి తన తండ్రిని ఈ పుస్తకం ద్వారా ప్రజలకు వైయస్సార్ ఏంటనేది పరిచయం చేసారంటూ వ్యాఖ్యానించారు. దీంతో..వైసీపీ అభిమానుల్లో ఈ పుస్తకం మీద మరింత ఆసక్తి పెరిగింది.

నో స్టాక్… 5 స్టార్ రేటింగ్…ఇంగ్లీషు అనువాదం..

విజయమ్మ ఈ పుస్తకంలో వైయస్సార్ తో తన వివాహం జరిగిన నాటి నుండి ఆయన మరణించిన నాటి వరకు చోటు చేసుకున్న పలు అంశాలను ఆసక్తిగా మలిచారు. వైయస్సార్ పలు సందర్భాల్లో చెప్పిన మాటలను ప్రస్తావించారు. ఇక, జగన్..షర్మిళ విషయంలో ఆయన ఎలా వ్యవహరించారనేది పాఠకులకు ఆసక్తి కరంగా మారింది. పిల్లలతోనే కాదు.. జగన్ తో పాటుగా షర్మిళ సంతానంతోనూ వైయస్సార్ ఎంత ఆప్యాయతతో ఉండేవారో విజయమ్మ వివరించారు. పాదయాత్ర సమయంలోనూ… ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనలో తాను దగ్గరగా చూసిన పలు కీలక అంశాలను అందులో ప్రస్తావించారు. దీంతో.. ఈ పుస్తకం ఆన్ లైన్ ద్వారా ఎమెస్కో పబ్లికేషన్స్ విక్రయాలు ప్రారంభించింది. తొలి రోజే మొదటి ఎడిషన్ కింద ముద్రించిన అయిదు వేల కాపీలు అమ్ముడు పోయాయి. 24 గంటల సమయంలో ఈ అమ్మకాలు జరిగాయి. ఆన్ లైన్ ద్వారా విక్రయాల్లో ఓ తెలుగు పుస్తకం తొలి ఎడిషన్ కాపీలన్నీ ఇలా తొలి రోజే అమ్ముడవ్వడం ఇదే తొలి సారిగా చెబుతున్నారు. ఇక, ఈ పుస్తకానికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వటం మరో ప్రత్యేకతగా గుర్తించారు. డిమాండ్ పెరుగుతుండటంతో..ఇప్పుడు రెండో విడత ముద్రణ ప్రారంభమైంది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో అందుబాటులోకి తేవటానికి పెంగ్విన్ పబ్లికేషన్స్ ముందుకు వచ్చింది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju