NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Visakha Steel Plant ; ఉక్కు రాజకీయం – హతవిధీ.. ఈ బందు ఎవ్వరి కోసం..!? ఈ విమర్శలు ఎవరిపై..!?

Visakha Steel Plant ; Politics in State Bandh

Visakha Steel Plant ; ఏపీలో రాజకీయం వింతగా మారింది..! ఎంత వింత అంటే దొంగ కళ్ళెదురుగా పారిపోతుంటే పట్టుకోవడం మానేసి… “నీ వల్లనే పారిపోయాడు, నీ వల్లనే పారిపోయాడు” అంటూ ఇద్దరు తన్నుకున్నంత వింతగా ఏపీలో రాజకీయం ఉంది. చివరికి విశాఖ ఉక్కు ఉద్యమం.., విశాఖ ఉక్కుకి మద్దతుగా జరుగుతున్న బందు.., ర్యాలీలు అన్ని అలాగే జరుగుతున్నాయి. ఈ రోజు జరుగుతున్న బందు కూడా దీనికి సాక్ష్యమే..!!

Visakha Steel Plant ; బందులో ఎవరు ఏమంటున్నారు..!?

బందులో టీడీపీ, వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. ఎన్ని పార్టీలు పాల్గొన్నా కీలక పార్టీలు మాత్రం టీడీపీ, వైసిపినే.. ఈ పార్టీల వాయిస్ జనంలోకి వెళ్తుంది. ఈ పార్టీల కార్యకర్తలు, నాయకులే కీలకం. వీళ్ళు యాక్టీవ్ గా ఉంటేనే బందు ప్రభావితం అవుతుంది. విశాఖ సహా… శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు అన్ని ప్రాంతాల్లోనూ బందు బాగానే జరుగుతుంది. ప్రభుత్వం కూడా సహకరించడంతో బందు పూర్తిగా జరుగుతుంది. బస్సులు తిరగడం లేదు, స్కూళ్ళు మూతపడ్డాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ దీనిలో అంతర రాజకీయమే బంధుని పక్కదోవ పట్టిస్తుంది. టీడీపీ, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే దారి మళ్లిస్తున్నాయి. ఉక్కు ఉద్యమాన్ని పక్కకు నెట్టేస్తున్నాయి.

Visakha Steel Plant ; Politics in State Bundh
Visakha Steel Plant Politics in State Bundh

* బందులో పాల్గొన్న టీడీపీ నేతలు ప్రతీ చోట వైసిపిని విమర్శిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, సీఎం జగన్ పోస్కో కంపెనీతో ఒప్పందం కారణంగానే విశాఖ ఉక్కు ప్రవేటీకరణ జరుగుతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ అవినీతి అని, ప్రభుత్వంలో సంక్షేమం కాకుండా రద్ధులు, కొట్టివేతలు ఎక్కువయ్యాయి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

* బందులో పాల్గొన్న వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నాడు చేసుకున్న ఒప్పందం కారణంగానే.. ఈ రోజు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వందలాదిగా ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రైవేయీటీకరణ జరిగాయి అంటూ విమర్శలు చేస్తున్నారు.

Visakha Steel Plant ; Politics in State Bundh
Visakha Steel Plant Politics in State Bundh

అసలు దోషిని ఏమి అనలేక..!!

ఒక్కటి మాత్రం స్పష్టం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణలో మొదటి దోషి కేంద్రం. మొదటి కారకుడు ప్రధాని మోడీ. ఆ తర్వాతే జగన్ అయినా.., చంద్రబాబు అయినా… కేంద్రం ప్రమేయం, అధికారం, నిర్ణయం లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమని రాష్ట్ర ప్రభుత్వం టచ్ కూడా చేయలేదు. ఈ విషయాన్నీ బాగా తెలిసిన టీడీపీ, వైసీపీలు కూడా బందు సాక్షిగా బీజేపీని ఏమి అనలేక… ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. బీజేపీని, ప్రధాని మోడీని, అమిత్ షాని ఏమి విమర్శించలేక… విశాఖ ఉక్కు వేదికగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేక… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. ఇలా చేస్తుంటే… ఎన్ని బందులు చేసినా… ఎన్ని ర్యాలీలు చేసినా ఫలితం ఉండదు. బీజేపీ దిగిరాదు..!!

 

 

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju