NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

YS Jagan Chiranjeevi: నేడు జగన్ తో చిరు బృందం భేటీ.. జరగబోయేది ఇదే..!!

YS Jagan Chiranjeevi: YCP Govt with TFI.. Issue Closing Today..!

YS Jagan Chiranjeevi: ఏపీలో నెలకొన్న ఆన్లైన్ సినిమా టికెట్ అంశంపై ఈ రోజు కీలక భేటీ జరగనుంది.. దాదాపు ఆరు నెలలకు పైగా నలిగిన ఈ అంశానికి ఈరోజుతో ఎండ్ కార్డు పడనున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని హీరోలు, దర్శకులు, నిర్మాతల బృందం సీఎం జగన్ తో భేటీ కానున్నారు. చిరంజీవితో సహా మహేష్ బాబు, ఇంకొందరు హీరోలు, కొరటాల శివ, ఎస్ ఎస్ రాజమౌళి, డీవీవీ దానయ్య సహా కొందరు నిర్మాతలు హాజరు కానున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ ఆన్లైన్ టికెట్ వ్యవహారానికి ఈ భేటీతో ఎండ్ కార్డు పడనుంది అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. మార్చి నుండి వరుసగా పెద్ద సినిమాల విడుదల ఉండడంతో రెండు వైపులా సావధానంగా పరిష్కరించుకుంటే మంచిది అనే నిర్ణయానికి ప్రభుత్వం, సహా సినీ పెద్దలు సైతం వచ్చినట్టు తెలుస్తుంది.

YS Jagan Chiranjeevi: YCP Govt with TFI.. Issue Closing Today..!
YS Jagan Chiranjeevi YCP Govt with TFI Issue Closing Today

YS Jagan Chiranjeevi: ఈ విధంగా ముగింపు పలకబోతున్నారా..!?

నిజానికి వైసీపీ ప్రభుత్వం ఈ మొత్తం ఇష్యూ ని రగిల్చింది ఒక మూల కారణంతో.. ఆ కారణం ఏమిటి..? అది నెరవేరిందా..? లేదా అనేది “న్యూస్ ఆర్బిట్” ఒక ప్రత్యేక కథనంలో విశ్లేషించాము ఈ లింకులో చూడగలరు.. (

YS Jagan: సినిమా టికెట్లు గొడవ అంతా ఉత్తుదే..! ఈ రోజు భేటీ క్లైమాక్స్ – ఆ ప్లాన్ ఫెయిల్..!?

) ప్రభుత్వం చేతిలోనే ప్రస్తుతం టికెట్ వ్యవస్థ ఉంది. ఈ కేసు హైకోర్టులో ఉన్నప్పటికీ కోర్టు పెద్దగా కల్పించుకోలేము అని చెప్పేసింది. సో.. టికెట్ ధర విషయంలో ప్రభుత్వం చెప్పేదే ఫైనల్ కాబోతుంది. అందుకు అనేకా కారణాలున్నాయి. అయితే సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టేయడం.. ప్రభుత్వ నిర్ణయించిన ధర ప్రకారం విడుదల చేస్తే 50 రోజులు హౌస్ ఫుల్ అయినా సినిమాకు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా రాదూ అని సినీ పెద్దలు వాదిస్తున్నారు. గతంతో పోలిస్తే దాదాపు 40 శాతం మేరకు కలెక్షన్లు పోతాయని.. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు అన్నిటికీ నష్టమేనని వారి వాదన. అందుకే టికెట్ వ్యవహారంలో కాస్త మధ్యస్థంగా వెళ్లాలని ప్రభుత్వం కూడా అనుకుంటుంది. గతంలోలా మరీ తగ్గించేయకుండా ఇటు ప్రభుత్వం, అటు సినీ పెద్దల తరపున ఓ కమిటీ వేసి ఆ కమిటీ తీసుకునే నిర్ణయాల మేరకు టికెట్ ధర నిర్ణయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పెద్ద సినిమాలకు ఓ విధంగా, చిన్న సినిమాలకు ఓ విధంగా ధర పెట్టె అవకాశం వీలుంది అంటున్నారు. ఉభయకుసలోపరి అనే విధంగా ఈ చర్చలు సాగి.. ఇరు వర్గాల ఈగోలు చల్లార్చి భేటీతో ఒక మధ్యస్థ ముగింపు ఇవ్వనున్నట్టు కచ్చితమైన సమాచారం. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా జగన్ దగ్గరకు ఈ భేటీకి క్యూ కడుతున్నారు..!

YS Jagan Chiranjeevi: YCP Govt with TFI.. Issue Closing Today..!
YS Jagan Chiranjeevi YCP Govt with TFI Issue Closing Today

ముందున్న సినిమాలన్నీ పెద్దవే..!

మార్చి 10 తర్వాత నుండి వరుసగా పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రాధేశ్యామ్ మొదలుకుని.. ఆర్ ఆర్ ఆర్, భీంలా నాయక్, సర్కారు వారి పాట, ఎఫ్ 3, ఆచార్య సహా పుష్ప 2 కూడా సిద్దమవుతుంది. దాదాపు రూ. 1500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సినిమాలు ఇవి. అందుకే వాటిని రాబెట్టుకోవాలంటే కచ్చితంగా పాత ధరలు ఉండాలనేది సినీ పెద్దల ఆలోచన. సో.. మార్చి మొదటి వారానికి ఈ ధరలు, కొత్త ధరలు, ప్రభుత్వ నియంత్రణ వంటి అన్ని అంశాలపైనా ఒక స్పష్టత రానుంది. ఈ వివాదం ముగియనుంది..!

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju