`మణికర్ణిక` తర్వాత కంగనా రనౌత్.. రాజ్‌కుమార్ రావ్, అమైరా దస్తూర్‌లతో కలిసి నటిస్తోన్న చిత్రం `మెంటల్ హై క్యా`. ప్రకాష్ కోవెల మూడి దర్శకుడు. జూన్ 21న సినిమా విడుదల కానుంది. షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో యూనిట్‌కు ఓ చిక్కొచ్చి పడింది. `మెంటర్ హై క్యా` అనే టైటిల్ మెంటల్ హెల్త్ కేర్ చట్టంలో సెక్షన్స్‌ను ఉల్లంఘించేలా ఉందని ఇండియన్ సైక్రియాటిక్ సోసైటీ (ఐపిఎస్) భావించి టైటిల్‌ను మారచాలంటూ సెన్సార్ బోర్డును కోరింది. ఇలాంటి టైటిల్ పెట్టి మానసిక రోగుల్ని అవమానిస్తున్నారని ఐపిఎస్ తెలిపింది. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. శోభా కపూర్, ఏక్తా కపూర్, శైలేష్ ఆర్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
previous post
next post