యువ కథానాయకుడు ఆకాష్ పూరి నటిస్తున్న `రొమాంటిక్` చిత్రంలో బాలీవుడ్ నటి మందిరాబేడీ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించారు. నటిగా, టెలివిజన్ హోస్ట్ గా ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఆమె నటించడానికి అంగీకరించిన `రొమాంటిక్` షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో కేతికా శర్మ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రేమకథ ప్రధానంగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. మందిరాబేడీ షూటింగ్ సెట్స్ కు చేరుకున్నారు. ఆమె పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు, ఆకాష్ పూరి తండ్రి పూరి జగన్నాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగులు అందిస్తున్నారు. పూరి, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. లావణ్య సమర్పిస్తున్నారు.
previous post
next post