Acharya: అందరూ అనుకున్నట్టుగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో చరణ్‌కు భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే జంజీర్ అనే సినిమాతో చరణ్ బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా చేశాడు. ఆ రకంగా కూడా బాలీవుడ్లో చరణ్‌కు పాపులారిటీ ఉంది. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియన్ సినిమాతో చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చేసింది. ఈ రకంగా చరణ్ నెక్స్ట్ సినిమాలను అదే స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు.
అందుకే, ఇప్పుడు ఆచార్య సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ నటించిన ఈ సినిమాపై ఇంతక ముందు కంటే ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత అంచనాలు అందరిలోనూ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో చరణ్‌కు బాలీవుడ్లో ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీ తో హిందీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. వాస్తవంగా ఇప్పటి వరకు ఆచార్య చిత్రాన్ని ఒక్క తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు చరణ్ ఉన్న మూలంగా లెక్కలన్నీ మారిపోయాయి.
Acharya: మెగా పాన్ ఇండియన్ సినిమాగా..
అందుకే, ఆచార్య సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని కొరటాల బృందం సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు సౌత్ భాషలలో హిందీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారట. అదే జరిగితే ఈ మెగా మల్టీస్టారర్ మెగా పాన్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా, ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ మెగాస్టార్‌కు జోడీగా నటించిన సంగతి తెలిసందే. చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించబోతుంది. కేవలం చిరు – చరణ్ కలిసి 25 నిమిషాల పాటు సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతుండటం ఇప్పుడు అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని పెంచేసింది.