NewsOrbit
Featured బిగ్ స్టోరీ

YS Jagan Cabinet: పదవి కోసం ఆ ఇద్దరి గొడవే జగన్ కి టెన్షన్.. వైసీపీలో పెద్ద పంచాయతీ..!!

YS Jagan Cabinet: Roja VS Peddireddy Tens to Jagan

YS Jagan Cabinet: వైసీపీలో ప్రత్యేక రాజ్యాంగాలుంటాయి.. సీఎం జగన్ కి కొన్ని ప్రత్యేక సూత్రాలుంటాయి.. టీడీపీలాగా లాబీయింగులు పనిచేయవు.. చంద్రబాబు లాగా లీకులు అసలే రావు.. సాగదీసుడు, నాన్చుడు, ముంచుడు, తేల్చుడు అసలే ఉండదు.. ఏదైనా ఒకటే నిర్ణయం.., ఒకటే మాట.. ఒకటే సంతకం.. అంతే ఇక దాని గురించి మళ్ళీ పునరాలోచించేది ఉండదు.. కానీ అటువంటి జగన్ కె ఓ ఇద్దరి విషయంలో చెమటలు పడుతున్నాయట.., ఓ ఇద్దరి విషయంలో టెన్షన్ పడుతున్నారట.. మంత్రి పదవులు ఇవ్వాలా..? వద్దా..? ఇస్తే ఎవరికీ ఇవ్వాలి..? మిగిలిన వారిని ఎలా శాంతిపపజేయాలి..!? అనే విషయంలో అంతర్మధనం చెందుతున్నారని వైసీపీ వర్గాల సమాచారం..! ఆ ఇద్దరే చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా..!

YS Jagan Cabinet: రోజా రచ్చ.. రచ్చా..!?

నగరి ఎమ్మెల్యే రోజా వరుసగా రెండోసారి గెలిచారు.. పార్టీలో మొదటి నుండి ఉన్నారు.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు.. సీనియర్ నేతగా పేరు తెచ్చుకున్నారు.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా టీడీపీని ముప్పుతిప్పలు పెట్టేలా అసెంబ్లీ లోపల, బయట విమర్శలు గుప్పించారు.. మాటదాడితో.. నోటిధాటితో జగన్ కి వెన్నుదన్నుగా నిలిచారు. అటువంటి రోజాకు 2019లో వైసీపీ మొదటి మంత్రివర్గంలోని మంత్రిగా అవకాశం వస్తుంది అనుకున్నప్పటికీ రాలేదు. దీంతో ఆమె బాగా అప్సెట్ అయ్యారు. ఓ విధంగా రచ్చ రచ్చ చేసారు. అంతర్గతంగా చాలా ఆవేదన చెందారు. సన్నిహితుల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు.. సర్లే ఏపీఐఐసీ పదవి ఇచ్చి.. రెండున్నరేళ్ల తర్వాత చూద్దాం అనే హామీతో సర్దుకుపోయారు..! కానీ ఇప్పుడు ఆమెకు పెద్దిరెడ్డి రూపంలో అడ్డు వస్తుంది. ఎలా అంటే…!?

YS Jagan Cabinet: Roja VS Peddireddy Tens to Jagan
YS Jagan Cabinet Roja VS Peddireddy Tens to Jagan

పెద్దిరెడ్డి మహా టార్గెట్..!

ఇక ఈ జిల్లాలో పెద్దిరెడ్డి చాలా సీనియర్. ఓ రకంగా చంద్రబాబు సమకాలీకుడు.. కానీ కాంగ్రెస్ హయాంలో మరుగున పడిపోయాడు. సీనియర్ అయినప్పటికీ.., వరుసగా గెలుస్తున్నప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అతన్ని పట్టించుకోలేదు.. కానీ సీఎం జగన్ మాత్రం పెద్దిరెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి వర్గంలో తన తర్వాత అంతటి స్థానాన్ని కట్టబెట్టారు.. పెద్దిరెడ్డి కూడా జగన్ కీ.., తనకి ఉమ్మడి శత్రువైన బాబుని రాజకీయంగా మెట్టు, మెట్టు దించేయడంతో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. దానిలో భాగమే కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలుపు..! ప్రస్తుతం కూడా కుప్పంలో చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో ఓడించే టార్గెట్ తో పని చేస్తున్నారు.. తన టీం తో చేయిస్తున్నారు..!

YS Jagan Cabinet: Roja VS Peddireddy Tens to Jagan
YS Jagan Cabinet Roja VS Peddireddy Tens to Jagan

* అటువంటి తరుణంలో పెద్దిరెడ్డికి మంత్రిగా తొలగిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు. పోనీ తొలగిస్తే తొలగించారు.. తాను సూచించిన వారికి ఇస్తే పర్వాలేదు.. కానీ రోజాకు ఇస్తే మాత్రం పెద్దిరెడ్డికి కొన్ని ఇబ్బందులు తప్పవు.. ఎందుకంటే నగరి నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గాన్ని పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తున్నారని.. వారికి పార్టీలో, నామినేటెడ్ పదవుల విషయంలో పెద్దిరెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రోజా గట్టిసా నమ్ముతున్నారు. అందుకు తగిన ఆధారాలతో ఆల్రెడీ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం..! సో.. ఇప్పుడు వాటిని మనసులో పెట్టుకున్న రోజాకు మంత్రి పదవి ఇస్తే కచ్చితంగా పుంగనూరు సహా పెద్దిరెడ్డి కోటలుగా ఉన్న తంబళ్లపల్లి, పూతలపట్టు లాంటి నియోజకవర్గాల్లో కొన్ని గ్రూపులు వచ్చే అవాకాసం ఉంది. పార్టీలో ఎంత సీనియర్ అయినప్పటికీ.. పార్టీ పరంగా ఎంత పెద్ద పదవి ఉన్నప్పటికీ మంత్రి అంటే మంత్రే.. అందుకే రోజా విషయంలో పెద్దిరెడ్డి చాలా సీరియస్ గా “వద్దు” అంటున్నారని సమాచారం. సో.. ఇక్కడ పెద్దిరెడ్డిని కొనసాగించి రోజాకు ఇవ్వకపోతే రోజా బాగా హర్ట్ అవుతుంది..” “రోజాకి ఇచ్చి పెద్దిరెడ్డిని పక్కన పెడితే కచ్చితంగా అంతర్గత అగ్గి పుట్టుకొస్తుంది..” పోనీ ఇద్దరికీ ఇవ్వాలంటే ఒకో జిల్లాలో ఒకో పార్లమెంటు పరిధిలో ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికీ మంత్రి పదవులు అంత మంచి సంకేతం కాదు అనే భావనలో జగన్ ఉన్నారట..! సో.. ఇదీ ఆ టెన్షన్, ఆ గొడవ..!

author avatar
Srinivas Manem

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju