Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో “గంగోత్రి” సినిమా తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ కాలంలోనే టాప్ హీరో రేంజ్ సంపాదించారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ కి తెలుగువాడైనా కానీ కేరళలో.. తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. మల్లువుడ్ లో… టాప్ హీరోల సినిమాలతో పాటు అల్లు అర్జున్ సినిమాలు కలెక్షన్లు సాధిస్తాయి. అటువంటిది ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా అదే రీతిలో లారీ డ్రైవర్ పాత్ర చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. అయితే అల్లు అర్జున్ కెరియర్లో స్టార్టింగ్ లో అందుకున్న రెమ్యూనరేషన్.. కేవలం వంద రూపాయలు మాత్రమే అంటా. తాజాగా ఈ వార్త.. ఇటీవల మీడియాలో బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా అల్లుఅర్జున్ లో చెప్పినట్లు కథనంలో సదరు ఛానల్ పేర్కొంది.
Read More: Allu Arjun: తన టీం అంటే ఎంత ప్రేమో మరోసారి నిరూపించిన అల్లు అర్జున్..!!
అల్లు అర్జున్ “గంగోత్రి” సినిమాలో రాకముందు చిరంజీవి “డాడీ” సినిమాలో చేయడం జరిగింది. కాగా దాని కంటే ముందే చిరంజీవి ఇంటిలో ఒక పార్టీలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు అదే పార్టీలో ఉన్న డైరెక్టర్ రాఘవేంద్రరావు 100 రూపాయలు ఇవ్వటం జరిగిందట. సో బన్నీ ఫస్ట్ రెమ్యూనరేషన్ వంద రూపాయలు అని తెలుసుకుని ఫాన్స్ షాక్ అవ్వుతున్నారు. ఇప్పటికి ఆ వంద రూపాయలు బన్నీ తన తల్లి గారి దగ్గర దాచినట్లు సదరు మీడియా చానల్ పేర్కొంది. మెగా కాంపౌండ్ నుండి ఎంట్రీ ఇచ్చినా గాని బన్నీ.. ప్రతి సినిమా విషయంలో చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా మంది టాప్ డైరెక్టర్ల సైతం చేపడం జరిగింది. డాన్స్ పరంగా లేదా ఫైట్స్ పరంగా సరికొత్తగా బన్నీ స్టాంట్ లు చేస్తూ… ఎప్పటికప్పుడు సరికొత్త మేక్ ఓవర్ తో కనిపిస్తూ ఉంటారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!