బాలకృష్ణ సమకాలిక హీరోల కొడుకులు ఆల్ రెడీ ఎంట్రీలు ఇవ్వటం మాత్రమే కాదు వారికంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసేసుకున్నారు. చిరంజీవి వారసుడిగా చరణ్, నాగార్జున వారసుడిగా అఖిల్, నాగచైతన్య ఎంట్రీ ఇవ్వగా వెంకటేష్ కుటుంబంలో రానా దగ్గుబాటి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాదాపు వీళ్లంతా పదికి పైగానే సినిమాలు చేసేసారు. ఇటువంటి తరుణంలో నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేదానిపై నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఉన్నారు.
గతంలో బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. మరి కొన్నాళ్లకు అసలు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఇష్టపడటం లేదని వ్యాపార రంగంలోకి వెళ్ళటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా పక్కన పెడితే ఇప్పుడు కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి బాలయ్య శ్రద్ధపెట్టినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. అంతేకాదు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా డైరెక్టర్ నీ కూడా బాలయ్య లైన్ లో పెట్టినట్లు టాక్.
మేటర్ లోకి వెళ్తే టాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ వంటి సినిమాలను తీసిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్… ఇటీవల ఓ స్టోరీ బాలయ్యకు వినిపించడం జరిగిందట. దీంతో ఈ స్టోరీ తన కొడుకు మోక్షజ్ఞకి కరెక్టుగా సూట్ అవుతుందని బాలయ్య డిసైడ్ అయినట్లు..ఫిల్మ్ నగర్ టాక్. ఇంకా అతని మరింతగా డెవలప్ చేయాలని రాహుల్ కి బాలయ్య సూచించినట్లు త్వరలో అధికారిక ప్రకటన ఉండనున్నట్లు సమాచారం. గతంలోనూ చాలాసార్లు ఇలాంటి ఊహాగానాలే.. వచ్చిన అవి నిజం కాలేదు. అయితే ఈసారి మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ పక్క అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.