Bheemla Naayak: “బీమ్లా నాయక్”.. ఫస్ట్ డే రిలీజ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో రికార్డుల వేట స్టార్టయింది. పవన్ రానా మధ్య హై పవర్ సన్నివేశాలు డైలాగులు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి… థియేటర్ లో పవన్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా.. గబ్బర్ సింగ్ తరహాలో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడంతో… పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీసు పై దండయాత్ర స్టార్ట్ అయింది.
త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్… ఫైట్లు.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉన్నాయి. అప్పట్లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో పవన్ నటించిన బద్రి సినిమాలో… ప్రకాష్ రాజు తో పవన్ నువ్వానేనా అన్నట్టుగా.. వచ్చే సన్నివేశాలు మాదిరిగా… “బీమ్లా నాయక్” లో ఇద్దరు హీరోల మధ్య సన్నివేశాలు ఉన్నాయని జనాలు అంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో… దూసుకు పోతూ ఉండగా మరో పక్క విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. ప్రివ్యూ స్క్రీనింగ్ లోనే “బీమ్లా నాయక్”.. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది.
ఈ విషయాన్ని ఓవర్సీస్ బిజినెస్ ప్రముఖ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. అమెరికాలో “బీమ్లా నాయక్” రిలీజ్ అయిన రోజు గురువారమే రూ. 6.53 కోట్లు రాబట్టింది. ఇక యూకేలో రూ. 87,81 లక్షలు, ఐర్లాండ్లో రూ. 6.44 లక్షలు సాధించడం విశేషం. ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా శుక్రవారం ఒక్కరోజే రూ. 83.22 లక్షలు వసూలు చేయడం విశేషం. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అంచనా వేస్తున్నారు. “బీమ్లా నాయక్” ఇలాగే కొనసాగితే… ఓవర్సీస్ పరంగా పవన్ కళ్యాణ్ కెరీర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ సినిమాగా నిలుస్తుందని మేకర్స్ అంటున్నారు.