Bheemla Naayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డులు క్రియేట్ చేయడంలో పగలగొట్టడంలో స్టైలే వేరు. ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ రాబట్టడంలో ఫస్ట్ ప్లేస్ లో పవన్ ఉంటారు. పవన్ సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద హడావిడి మామూలుగా ఉండదు. అదే సమయంలో మరో సినిమా రిలీజ్ చేయడానికి కూడా ఎవరూ ధైర్యం చేయరు.
ఇప్పుడు ఇదే సీన్ “బీమ్లా నాయక్” విషయంలో చోటు చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అవుతుండగా దాదాపు అయిదు సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. కాగా ఫిబ్రవరి 25వ తారీకు విడుదలైన “బీమ్లా నాయక్” పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. కలెక్షన్లు బీభత్సంగా వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట స్టార్ట్ చేయడం జరిగింది. తాజాగా “బీమ్లా నాయక్” నైజాంలో సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.
నైజాంలో ఒకరోజే 13.6 కోట్ల షేర్ వసూలు రాబట్టడం ఆల్ టైం రికార్డు గా నైజాంలో “బీమ్లా నాయక్” రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రీ బుకింగ్ సమయంలోనే భారీగా వసూళ్లు రాబట్టిన సినిమా విడుదలయ్యాక కూడా అదే జోరు నైజాంలో కొనసాగిస్తూ ఉండటంతో… నైజాం గడ్డ పవన్ అడ్డ అని అభిమానులు అంటున్నారు. వీకెండ్ లో మరి ఇంత కలెక్షన్లు రావడం గ్యారెంటీ అని.. ఓవరాల్ గా బీమ్లా నాయక్ పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలుస్తుందని చెప్తున్నారు. అజ్ఞాతవాసి వంటి అట్టర్‌ఫ్లాప్ వచ్చినా గానీ దాన్ని మర్చిపోయే రీతిలో త్రివిక్రమ్… పవన్ కి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.