బిగ్ బాస్ 4 : హౌస్ లో అరియానా చేసిన పనికి అంతా నోరు తెరిచారు…! చప్పట్లు ఒక్కటే తక్కువ

బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ లపై ప్రేక్షకులకు ఉన్న ఇమేజ్ మారిపోవడానికి ఒక సంఘటన చాలు. ఒకే ఒక్క ఘటనతో ఎవరైనా ఆకాశమంత ఎత్తుకి ఎగరవచ్చు లేదా పాతాళానికి పడిపోవచ్చు. దీనిని మనం గత మూడు సీజన్లలో గమనించాం.. అప్పుడప్పుడు కంటెస్టెంట్ లు కొన్ని త్యాగాలు చేయ వలసి వస్తుంది పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అన్నది వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇక ఏడవ వారం కి సంబంధించిన నామినేషన్ బిగ్ బాస్ ఇలాంటిదే ఒక పెద్ద ట్విస్ట్ పెట్టాడు.

 

హౌస్ ని జంటలుగా విడగొట్టిన తీరు చూస్తే బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏమిటో అర్థం అయింది. ప్రేమకి త్యాగానికి మధ్య ఎవరైతే నలిగిపోతారో వారిని ఒకే గ్రూప్ లో వేసి ఇరుకున పెట్టాడు. వారు త్యాగం చేస్తారా లేదా అని ప్రేక్షకులకి ఉన్న సందేహాలు అన్నీ ఒక్కసారిగా తీర్చేశారు. ఇక గత కొద్ది రోజులుగా చాలా మంది మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇక అలాంటి సందర్భంలో నామినేషన్ సమయంలో మీరు ఇదే సందు దొరికింది అని గొడవలు పెట్టుకుంటారా లేదా సర్దుకుని త్యాగం చేస్తాడా అన్నది నిన్న పరీక్షలో తేలింది.

ఇక ఏదో ఒకలాగా అన్ని జంటలు ఒక కొలిక్కి వచ్చాయి కానీ మెహబూబ్-అరియానా మాత్రం అలాగే ఉన్నారు. అరియానాకి ముందు నుంచి అస్సలు వెనక్కితగ్గే అలవాటు లేదు. ఓటమిని ఒప్పుకోదు. ఫలితం గురించి పక్కన పెట్టి ఏదో ఒకటి చేయాలన్న తపన. ఇక అలాంటి ఈ సమయంలో మెహబూబ్ ను సోహెల్ ఒక వారం కాపాడేశాడు కానీ ఇప్పటివరకు అరియానా కు అలా అదృష్టం దక్కింది లేదు.

ఇద్దరిలో ఎవరు తగ్గలేదు. నాకోసం నువ్వు వెళ్లొచ్చు కదా అంటే నా కోసం నువ్వు వెళ్ళు అని వాదించుకున్నారు. బిగ్ బాస్ మీరే తేల్చుకోండి అని చెప్పేసాడు. మెహబూబ్ తనకు సాయం చేయడని తెలిసిన అరియానా పట్టు వదిలింది. నామినేట్ అయ్యేందుకు సిద్ధమైంది. మెహబూబ్ ని చూసి ఒక నవ్వు నవ్వి తర్వాత ఏడ్చేసింది. నువ్వు నాకు సాయం చేయాల్సిన అవసరం లేదంటూ బాధను ఆపుకుంది. ఆమె చేసిన పనికి ఇంటా బయటా ప్రశంసల వెల్లువలా ఎత్తగా…. మెహబూబ్ మాత్రం ఇంట్లోనే చాలా నెగిటివిటీ ను మూటగట్టుకున్నాడు.