బిగ్ బాస్ 4 : సోహెల్ ఏంటి ఇలా తయారయ్యాడు? “నాతో గొడవ పెట్టుకోండి అందరినీ ఏసి పడేస్తా..”

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఒక దూకుడు గల కంటెస్టెంట్ ఉంటాడు. మొదటి నుండి ఇదే ఆనవాయితీ. ఈ సీజన్లో సోహెల్ ఆస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే గతంలో దివి పైన నోరు లేపినందుకు నాగార్జున అతనికి వారాంతపు ఎపిసోడ్ లో బాగానే చివాట్లు పెట్టాడు. బెల్ట్ విదిలించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. అంతే… ఆ వారం నుండి చాలా సహనంతో ఇంటి సభ్యులతో వ్యవహరిస్తూ వస్తున్నాడు.

 

ఒకానొక సమయంలో తన కోపాన్ని కంట్రోల్ ఏడ్చేశాడు కూడా. తన తప్పు లేకపోయినా అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని అన్నాడు. వెంటనే ఆ తర్వాతి వారం నాగార్జున అతని నియంత్రణను మెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు సోహెల్ హౌస్లో వీరంగం చేస్తున్నాడు. చాలా కొత్త సోహెల్ ను అందరికీ చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరితో జోకులు వేస్తూ ఉన్నాడు.

తాజాగా విడుదల చేసిన ప్రోమో లో మీకు ఎవరికైనా నామినేట్ అవ్వాలంటే నాతో గొడవ పెట్టుకోండి ఇక అన్ని పంచాయతీ కే జరుగుతాయి ఈ ఇంట్లో… నాతో గొడవ పెట్టుకున్న అందరినీ నామినేషన్ లో ఏసి పడేస్తా అంటూ తొడ కొట్టాడు.

ఇక ఈ సంభాషణ అంతా కిచెన్ ఏరియాలో చాలా ఫన్నీగా సాగింది. అమ్మరాజశేఖర్, అభిజిత్, లాస్య, నోయల్ అక్కడ ఉన్నప్పుడు వారు కూడా సోహెల్ తో కలిసి సందడి చేశారు. మధ్యలో అమ్మ రాజశేఖర్ … నువ్వు ఏమి పెద్ద కంటెస్టెంట్ కాదు అని నోయల్ అన్నాడు అని చెబితే వెంటనే సోహెల్ కుర్చీకి ఎక్కి తొడగొట్టి అతనికి సవాల్ విసిరాడు. ఇలా సోహెల్ లో వచ్చిన మార్పు చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.