అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. మరి మూడు రోజులలో సినిమా విడుదల కానున్న తరుణంలో ‘లాల్ సింగ్ చడ్డా’ ఏఎమ్బి సినిమాస్లో ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఈ షోకి మెగాస్టార్ చిరంజీవిగారు, మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కింగ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్య, మెగానిర్మాత అల్లు అరవింద్, యువ హీరోలు సాయితేజ్, అల్లు శిరీష్, కార్తికేయ, దర్శకులు మారుతి, హరీశ్ శంకర్, నిర్మాతలు సురేశ్ బాబు తదితరులు హజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..”లాల్ సింగ్ చడ్డా” అందరికీ నచ్చే సినిమా అని తెలిపారు. అమీర్ ఖాన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశం గర్వించదగ్గ నటుడని కొనియాడారు. ఇక నాగ చైతన్య పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమాలో చైతు పాత్ర కీలకం. మంచి సినిమాలను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ‘లాల్ సింగ్ చడ్డా’ ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని మనఃస్పూర్తిగా నమ్ముతున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.
ఇప్పటికే విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్లో సూపర్ హిట్టైన ఫారెస్ట్ గంప్ చిత్రం ఆదారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానుంది.