Chiranjeevi: ఆర్ఆర్ఆర్‌ను మించిపోయేలా ఆచార్య కోసం చిరంజీవి స్ట్రాటజీ..

Share

Chiranjeevi: రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు. అందులోనూ అందరూ యంగ్ డైరెక్టర్స్‌కే అవకాశాలిస్తూ షాకిస్తున్నారు. ఇప్పుడు యంగ్ హీరోలకంటే దూకుడుగా మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆచార్య సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు చిరు. ఇందులో రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించగా వచ్చే నెల 4వ తేదీన రిలీజ్ కానుంది. అయితే మరోసారి ఆచార్య రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని ఇప్పుడు టాక్ మొదలైంది.

chiranjeevi strategy regarding acharya
chiranjeevi strategy regarding acharya

ఇక ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రాన్ని చేస్తున్నారు చిరు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్ రీమేక్‌గా ఇది రూపొందుతోంది. సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో సందడి చేయనున్నారు. అలాగే మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవగా ఓ స్టైలిష్ ఫైట్‌తో పాటు లావియష్‌గా వేసిన సెట్‌లో ఓ సాంగ్ కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. తమన్నా హీరోయిన్‌గా..కీర్తి సురేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Chiranjeevi: ఒక్కో సినిమా ఎట్టి పరిస్థితుల్లో 60 రోజుల్లో పూర్తి..

ఇదే క్రమంలో బాబి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ చిరంజీవికి సోదరుడుగా నటిస్తున్నారు. అలాగే ఛలో, భీష్మ చిత్రాలతో హిట్స్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు మెగాస్టార్. ఇలా వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన చిరు ఒక్కో సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. ఇది నిజంగా మెగాస్టార్‌కే సాధ్యమని చెప్పాలి.


Share

Related posts

వైసీపీలో ఏదో జరుగుతుంది..! పార్టీ వీడుతానంటున్న సీనియర్ ఎమ్మెల్యే..!?

Srinivas Manem

Kodali Nani : కొడాలి నాని అడ్డాలో రెపరెపలాడిన టీడీపీ జెండా..!!

sekhar

బిగ్ బాస్ 4: అభిలో అదే మైనస్ అంటున్న మోనాల్..!!

sekhar