Devatha Serial: సత్య రాముల వారి కళ్యాణానికి పూజ సామాన్లు తీసుకువస్తుండగా.. దేవి అడ్డుపడి సత్యను పక్కకు తీసుకొస్తుంది. ఏంటి దేవి ఏమైంది అని అడుగగా.. నీతో ఒక విషయం చెప్పాలి చిన్నమ్మ. మీ అమ్మ దగ్గర నుంచి నిన్ను ఎవరైనా తీసుకువెళతాను అంటే.. నీకు ఎలా ఉంటుంది అని అంటుంది దేవి.. అమ్మ దగ్గర నుంచి ఎవరైనా తీసుకెళ్తాను అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది అని సత్య అంటుంది.. మరి నన్ను ఎందుకు మా అమ్మకు దూరం చేస్తున్నారు అంటూ దేవి సత్యను నిలదీస్తుంది..!
నిన్ను మీ అమ్మను దూరం చేస్తున్నారా ఎవరమ్మా ఎవరు దూరం చేసేది అని సత్య అడుగుతుంది. దేవి సమాధానం చెబుతుండగా రాధా దేవమ్మ అని గట్టిగా పిలుస్తుంది.. పదా గుడిలోకి వెళ్దాం అని అంటుంది. ఉండమ్మా నేను రాను అని ఎంత చెబుతున్నా ఆఫీసర్ వినడం లేదు.. అదే చిన్నమ్మకు చెబుతున్నాను అని అంటుంది.. చిన్నమ్మకు చెబితే చిన్నమ్మ ఏం చేస్తుంది. ఏంటి అక్క దేవి ఏం చెబుతుందో నాకు అర్ధం కావట్లేదు అంటుంది. హాస్టల్ లో చేర్పిస్తా అంటున్నాం దాని గురించి చెబుతుంది. ఆఫీసర్ సార్ గురించి ఏదో అంటుంది. ఈ పూజ అయ్యేవరకు తనతోనే ఉండమంటే లేదు నాతోనే ఉంటాను అంటుంది. ఆఫీసర్ కి నువ్వంటే చాలా ఇష్టం అమ్మ.. పూజ అయ్యేవరకు ఆఫీసర్ సార్ తోనే ఉండు అని సత్య అంటుంది.
దేవి పూజ దగ్గర నుంచి దూరంగా వస్తుంది. ఏమైందమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంది.. నేను చిన్నమ్మ కి బిడ్డలు పుట్టాలని దేవుడు మొక్కుకుంటున్నాను. చిన్నమ్మ కి బిడ్డలు పుడితే ఇంకా నన్ను కావాలి ఆనరు కదా.. అప్పుడు నేను నీతోనే ఉండచ్చు అని అంటుంది.