Devatha Serial: దేవి చూస్తుందని కావాలని తన రూం లో ఒక రాక్ లో తన చనిపోయిన భార్య ఫోటో దగ్గర నుంచుని.. నీకు నాకు పుట్టిన బిడ్డ ను తీసుకువచ్చి తినే మీ అమ్మ అని పరిచయం చేయాలని ఉంది.. కానీ మన బిడ్డ పుట్టినప్పటినుంచి రాధనే తనకు తల్లిగా మారింది.. అందుకే నిన్ను తనకి చూపించడం లేదు. నన్ను క్షమించు అని తనని చూస్తూ మాధవ్ ఏడుస్తాడు.. మాధవ్ వెళ్ళిపోయిన తర్వాత దేవి ఆమె ఎవరో అని చూడాలని ర్యాక్ ఓపెన్ చేస్తుంది.. అందులో చనిపోయిన మాధవ్ భార్య ఫోటో ఉంటుంది. దేవి ఆ ఫోటో చూస్తూ అయితే ఈమె నా తల్లి అని అనుకుంటుంది.. దేవి చూడాలనే మాధవ్ ఇదంతా చేస్తాడు..!
సత్య త్వరగా రెడీ అవ్వు మనం హాస్పిటల్ కి వెళ్ళాలి అని చెబుతోంది దేవుడమ్మ. ఆదిత్య ఇప్పుడు ఎవరికీ ఏమైందమ్మా హాస్పిటల్ కి వెళ్లడానికి అని అంటున్నావు అని అడుగుతాడు. సత్య బిడ్డలు పుడతారు అని నాకు గట్టిగా నమ్మకం ఉంది. అందుకే హాస్పిటల్ కు తీసుకు వెళ్తే మరోసారి మనకి మంచి న్యూస్ తెలిసే అవకాశం ఉందని అంటుంది. అంత నమ్మకం ఏంటమ్మా అని అడుగుతాడు ఆదిత్య. నేను ఊర్లోకి వెళ్ళినప్పుడు పండితుడు కలిశాను. అయినా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పాడు. అంతేకాదు చనిపోయినా మన రుక్మిణి కూడా బ్రతికే ఉంది అని చెప్పాడు. ముందు సత్య హాస్పిటల్ కి వెళ్లి విషయం తెలుసుకున్న తర్వాత రుక్మిణి వెతికే ప్రయత్నంలో ఉంటానని చెబుతుంది దేవుడమ్మ.
వాళ్ళ అమ్మ మాటలు విన్న ఆదిత్య మనసులో నిజంగా రుక్మిణీ బ్రతికే ఉందమ్మా.. నాకు పిల్లలు పుట్టారు. దేవి నీ మనవరాలు.. కానీ ఈ విషయాన్ని నేను నీకు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు రుక్మిణీ వేరొకరి భార్య. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని మనసులో అనుకున్నాడు ఆదిత్య. సత్య కూడా మీరు చెప్పింది నిజమే ఆంటీ. రుక్మిణి బ్రతికే ఉంది. కానీ ఈ విషయాన్ని మీకు ఎలా చెప్పగలను అని మనసులో అనుకుంటుంది.