F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం `ఎఫ్ 3`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అందులో వెంకీకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ నటించారు. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ కీలక పాత్రలను పోషించారు.
2019లో సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన `ఎఫ్2` చిత్రానికి `ఎఫ్3` సీక్వెల్. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. దానికి ప్రకారం.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాలిడి బిజినెస్ చేసిందట. ఈ చిత్రానికి రూ. 60 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని అంటున్నారు. సినిమాకి మంచి టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి.
కాగా, డబ్బు, దాని వల్ల వచ్చే ఫ్రస్టేషన్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఇందులో వెంకటేష్ రేచీకటి ఉన్న వ్యక్తిగా నటిస్తే, వరుణ్ నత్తితో ఇబ్బంది పడే యువకుడిగా కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేసింది.