Ram: 2019కి ముందు వరుస ఫ్లాపులతో కెరియర్ పరంగా రామ్(Ram) అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం తెలిసిందే. కానీ ఆ టైంలో డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) “ఇస్మార్ట్ శంకర్”(Ismart Shankar) అనే సినిమా… తీయడంతో మళ్ళీ రామ్ హిట్ ట్రాక్ ఎక్కాడు. “ఇస్మార్ట్ శంకర్” కి ముందు రామ్ నటించిన సినిమాలు చాలా వరకు లవర్ బాయ్ ఇమేజ్ కలిగిన కంటెంట్. కానీ దానికి భిన్నంగా మాస్ తరహాలో “ఇస్మార్ట్ శంకర్” లో రామ్ నీ చూపించిన విధానం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఫలితంగా సినిమా బంపర్ హిట్ అయింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో మంచి జోరు మీద ఉన్న రామ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగస్వామి(Lingu Swammy) దర్శకత్వంలో “ది వారియర్”(The Warrior) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో రామ్ కనిపిస్తున్నారు. జులై 14 వ తారీకు “ది వారియర్” సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా అయినా వెంటనే బోయపాటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ రామ్ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తమిళ దర్శకుడికి రామ్ ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
మీటర్ లోకి వెళ్తే తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్(Gowthem Menan) ఇటీవల రామ్ కి స్టోరీ వినిపించడం జరిగిందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్లు.. అంతా ఓకే అయితే త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. గతంలో తెలుగులో విక్టరీ వెంకటేష్ తో ఘర్షణ ఇంక నాగచైతన్యతో… ఏం మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలు గౌతమ్ మీనన్ తీశారు. అన్నీ కూడా తమిల్ నుండి తెలుగులోకి రీమేక్ చేసిన సినిమాలు. అయితే ఇప్పుడు రామ్‌తో కూడా గౌతమ్ ఒక రీమేక్‌ను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.