Sriram: తెలుగులో ప్రారంభంలో “ఒకరికి ఒకరు”.. ఇంకా చాలా లవ్ స్టోరీ సినిమాలలో హీరోగా వరుసపెట్టి సినిమాలు చేసిన శ్రీరామ్.. తర్వాత “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే”, సంక్రాంతి,”దడ”, “లై” వంటి చిత్రాలలో కీలక పాత్రలు చేయడం జరిగింది. అయితే మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న శ్రీ రామ్ ఇప్పుడు చాలాకాలానికి.. టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ బన్నీ క్రేజీ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దక్షిణాది సినిమాలు భాషలు గురించి మాట్లాడుతూ ప్రజెంట్.. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల వైపు వెళ్తే అక్కడి ప్రజలు కచ్చితంగా మనల్ని సౌతిండియా నటీనటులనీ గుర్తిస్తారు. చాలావరకు ఇప్పుడు సౌతిండియా సినిమాలను అక్కడి ప్రజలు డబ్ చేసి చూస్తున్నారు. ఇక బీహార్, యూపీ వైపు వెళ్తే అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా ఉండదు. “పుష్ప” ఆ రీతిలో ఆ రెండు రాష్ట్రాలలో ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఇక కేరళ స్టార్టింగ్ నుండి బన్నీకి తిరుగులేని మార్కెట్ అక్కడ ఉంది. సినిమాకి ఆ భాష ఈ భాష అని లేదు.
“పుష్ప” కి ఆ రెండు రాష్ట్రాల ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. సో నాకు కూడా తెలుగు అని తమిళం అని ఉండదు అవకాశం ఎక్కడ వచ్చినా సినిమా చేస్తాను అంటూ శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హిందీ ఇంకా ఇతర భాషల గురించి సౌత్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలు కామెంట్ చేయడం జరిగింది. దానికి బాలీవుడ్ ప్రముఖ హీరోలు గట్టిగానే సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద గొడవగా మారింది. దీంతో భాష గురించి ఇంకా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రశ్నలు వేసినా సమయంలో హీరో శ్రీరామ్ ఈ రీతిగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎటువంటి భాష అయినా పర్వాలేదు అవకాశంగా భావించి పని చేస్తానని తెలిపారు.