ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా ఇంజన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. టాప్ మోస్ట్ డైరెక్టర్ రాజమౌళి బ్యాక్ టు బ్యాక్ “బాహుబలి 2:, ‘ఆర్ఆర్ఆర్’ లతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం సంచలనం సృష్టించింది. ‘ఆర్ఆర్ఆర్’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫస్ట్ టైం తారక్ మరియు చరణ్ నటించటం సినిమాపై ఆసక్తిని పెంచింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరిని అలరించింది.
థియేటర్ లలో ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో అదే రీతిలో ఓటీటీలో ‘ఆర్ఆర్ఆర్’ కి బ్రహ్మరథం పట్టారు. నెట్ ఫ్లిక్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ చూసిన హాలీవుడ్ వాళ్లు సోషల్ మీడియాలో సినిమా యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా కొమరం భీం పాత్రకి చాలామంది బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని దేశాలలో అయితే ఎన్టీఆర్ నటన పట్ల అక్కడి ప్రముఖ పత్రికలు పెద్ద పెద్ద ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఇటీవల ఆస్కార్ రేసులో కూడా ఈ సినిమాతో ఎన్టీఆర్ నిలిచినట్లు వార్తలు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమా గురించి గూగుల్ లో ‘ఆర్ఆర్ఆర్’ అని టైప్ చేస్తే సరికొత్త సింబల్స్ దర్శనమిస్తున్నాయి. గూగుల్లో టైప్ చేస్తే ఓ బైక్, ఓ గుర్రం కనిపిస్తాయి. అంతేకాదు రామ్ చరణ్, ఎన్టీఆర్ను గుర్తుకు తెచ్చేలే అవి అటు ఇటు కదులుతూ ఉన్నాయి. గూగుల్ లో చాలామంది ఈ సినిమా పేరు టైప్ చేయడంతో పాటు అనేక రికార్డులు సృష్టించడంతో గూగుల్ ఈ రీతిలో “RRR”కి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆగస్టు 14 వ తారీకు ఈ సినిమా స్టార్ మా లో ప్రసారం చేయడం జరిగింది. ఈ క్రమంలో భారీ ఎత్తున టిఆర్పి రేటింగులు నమోదు కావడం జరిగింది. థియేటర్ నుండి సినిమా బయటకు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా గాని … RRR హవా ఇంకా నడుస్తూనే ఉంది.