Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. “పుష్ప” సినిమా గత ఏడాది డిసెంబర్ మాసంలో విడుదలై అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో బన్నీ నటించిన ఈ సినిమా ఊహించని విధంగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించింది. “పుష్ప” డైలాగులు… స్టెప్పులు చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గాని వంద కోట్లకు పైగా కలక్షన్ “పుష్ప” సాధించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
హీరోయిన్ రష్మిక మందన స్టెప్పులు… సినిమాలో పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకోవడం తెలిసిందే. అటువంటి ఈ సినిమా గురించి బాలీవుడ్ డైరెక్టర్ ఇమిథియాజ్ ఆలీ ఇటీవల ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా తీయటం అనేది భాషతో సంబంధం లేదని చెబుతూ… మా బ్రదర్ కాశ్మీర్ రాష్ట్రంలో ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అక్కడ తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని ఒక కుర్రవాడికి తెలియజేయడానికి ముందుగా..సినిమాలు చూస్తావా అని ప్రశ్నించాడు..? చూస్తాను అని ఆ బాలుడు తెలిపాడు. దాంతో నీకు ఇష్టమైన హీరో ఎవరు అని ఆ బాలుడిని మా బ్రదర్ ప్రశ్నించాడు.
దానికి ఆ బుడ్డోడు సమాధానం ఇస్తూ అల్లు అర్జున్ అని చెప్పాడు. అయితే అప్పటికి ఇంకా “పుష్ప” విడుదల కాలేదు. దీన్ని బట్టీ సినిమా మేకింగ్ కంటే క్యారెక్టరైజేషన్ చాలా ముఖ్యం. ఒక ప్రాంతానికి సినిమాని పరిమితం చేయకుడాదు అంటూ డైరెక్టర్ ఇమిథియాజ్ ఆలీ…అల్లు అర్జున్ క్రేజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ జూలై నెలలో స్టార్ట్ కానుందట. వీలైనంత త్వరగా… కంప్లీట్ చేసి ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే వేసవికాలంలో.. సినిమాని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…
Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…