29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Das Ka Dhamki Pre Release Event : ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Das Ka Dhamki Pre Release Event : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కీ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆస్కార్ అందుకున్న తర్వాత… అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ మాట్లాడిన స్పీచ్ సంచలనం సృష్టించింది. “RRR” సినిమాకి ఆస్కార్ రావడానికి ప్రధాన కారణం రాజమౌళితో పాటు తెలుగు మరియు భారతీయ చలనచిత్ర ప్రేక్షకులు అని స్పష్టం చేశారు. ఆస్కార్ అందుకోవడానికి కీరవాణి, చంద్రబోస్ స్టేజిపై ఎక్కిన సమయంలో… తెలుగుదనం ఒట్టిబడిందని… నా రెండు కళ్ళతో చూసిన ఆ సీన్ ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాకపోవచ్చు అనీ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇకనుండి తెలుగు భారత చలనచిత్రలు… ఇదే రీతిలో ముందుకు దూసుకెళ్లిపోవాలి.

in das ka dhamki pre release event ntr sensational comments on vishwek sen

RRR ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు చలనచిత్రాలు ఎప్పటికీ అదే రీతిలో ప్రపంచ సినీ చరిత్రలో నిలిచిపోవాలి… ఆ రీతిగా అందరం కలిసి ముందుకు వెళ్లాలి అని ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చారు. ఇదే సమయంలో హీరో విశ్వక్ సేన్ కీ సినిమా అంటే బాగా పిచ్చి. తనని తాను రుజువు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లోకి వచ్చిన వ్యక్తి. నటుడిగా తనలో వైవిధ్యమైన నటన చాలా తక్కువ సమయంలో… చూపించడానికి అతడు ఎన్నుకున్న సినిమాల తీరు… నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. విష్వక్ ఒక ఎనర్జీ బాల్ .. ఆయనలా మైకులో నేను మాట్లాడలేను.

in das ka dhamki pre release event ntr sensational comments on vishwek sen
Das Ka Dhamki Pre Release Event 

నేనే అంటే ఆయన నాకంటే ఎక్కువగా మాట్లాడతాడు. మనసు బాగోలేనప్పుడు నేను చూసే సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి”. ఆ సినిమాలో మరో కమెడియన్ తో పాటు విశ్వక్ నటన కామెడీ పండించే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. విష్వక్ లో నాకు నచ్చింది కాన్ఫిడెన్స్. దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న వస్తోంది .. తప్పకుండా అది బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అయితే విష్వక్ ఈ సినిమాతో ఇక దర్శకత్వం ఆపేయాలి .. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలి.. అంటూ ఎన్టీఆర్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.


Share

Related posts

కాంగ్రెస్‌పై హీరో ఆగ్ర‌హం

Siva Prasad

ఆగిన ‘అన్నాతే’ షూటింగ్..! రజినీకాంత్ సినిమాకు కరోనా షాక్..!!

Muraliak

Samantha: విడాకుల తరువాత ఆ ఒక్క విషయంలో సమంత చాలా ఇబ్బందులు పడుతోంది..

Ram