Waltair Veerayya: ఆహా “అన్ స్టాపబుల్” టాకీషో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దేశంలోనే అనీ టాకీషో లలో నెంబర్ వన్ స్థానంలో ఈషో నిలిచింది. గత ఏడాది స్టార్ట్ అయిన ఈ షో మొదటి సీజన్ చాలామందిని ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు రెండో సీజన్ మొదటి సీజన్ కంటే మరింతగా గ్రాండ్ గా జరుపుతున్నారు. దీనిలో భాగంగా సినిమా సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులను తీసుకొస్తున్నారు. సెకండ్ సీజన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి వారు రావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “వాల్తేరు వీరయ్య” జనవరి 13వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వెబ్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కి వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనిలో భాగంగా బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకి చాలామంది సెలబ్రిటీలు వెళ్లడం పై… మరి మీరు ఎప్పుడు వెళ్తారు అని యాంకర్ ప్రశ్నించారు. దానికి చిరంజీవి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అది అవతలి వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని. అలాంటి కోరిక ఇప్పటివరకు తనకు రాలేదన్నారు. ఒకవేళా అలాంటి అవకాశం వస్తే ఆలోచిస్తానని తెలిపారు. అంతేకాదు ఇండస్ట్రీలో విభేదాలు ఉన్నప్పటికి.. తాను అందరితో కలిసిపోతానని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తనకు అందరూ సమానమేనని.. అందరికి ఒకే రకమైన విలువ ఇస్తామని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తన సినిమా కంటే ముందు వీరసింహారెడ్డి విడుదలవుతున్న నేపథ్యంలో అది కూడా విజయం సాధించాలని చిరంజీవి కోరుకున్నారు. ఇదే సమయంలో అల్లు అరవింద్ కుటుంబంతో విభేదాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటువంటి వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి.

మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. కుటుంబ పరంగా అయితే ఎప్పుడు మేము కలిసే ఉన్నాము. అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు వారి ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాం అనే చిరంజీవి స్పష్టం చేశారు. రీసెంట్ గా క్రిస్మస్ పండుగ సమయంలో నేను లేకపోయినా మా కుటుంబంలో అందరూ ఒక దగ్గర చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ టైంలో బన్నీ కూడా ఇంటికి వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. వృత్తిపరంగా కెరియర్ పరంగా ఎవరి దారి వారిదే. కుటుంబ పరంగా ఎటువంటి అభ్యంతరాలు గొడవలు లేవు ఎటువంటి వేడుక జరిగిన కలసి సెలెబ్రేట్ చేసుకుంటాం.. అందరం హ్యాపీగా ఉన్నాం అని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.