Intinti Gruhalakshmi: అంకిత వాళ్ళమ్మతో వెళ్లడం ఇష్టమేనని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు.. అంకిత ఇంట్లో నుంచి వెళ్లడానికి ఒప్పుకోలేదు.. నేనే బలవంతంగా అంకితను ఒప్పించానని తులసి అందరి ముందు చెబుతుంది.. అసలు అంకితను ఎందుకు ఒప్పించిందో.. ఎలా ఒప్పించిందో అందరిముందు వివరిస్తుంది..
అభి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఇష్టపడ్డాని.. తన మీద ఉన్న ప్రేమ తనకు అడ్డం వచ్చిందని తెలుసుకున్న తులసి.. అభి వెళ్లడానికి అంకిత ఒప్పుకోదని తెలిసి అంకిత ను ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం అంకిత దగ్గరికి వెళ్లి నేను చెప్పేది విను అంకిత. ఈ నిర్ణయం మీ ఇద్దరి జీవితాలకు సంబంధించింది.. మీ అమ్మ ఇచ్చిన ఆఫర్ కు అభి ఇష్టపూర్వకంగా ఉన్నాడు. అభి తో పాటు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. మా మీద కోపం ఉంటే ఈ విధంగా పగ తీర్చుకోకండి ఆంటీ అని అంకిత అంటుంది. మీ అమ్మా ఆఫర్ కి అభి ఒప్పుకోవడం తోపాటు ఇంట్లో నుంచి తన వెళ్లిపోవడానికి అడ్డం నేనే అని తన నోటితో నేనే విన్నాను.. ఇప్పుడు చెప్పు అంకిత నేను ఏ నిర్ణయం తీసుకోవాలో.. నువ్వే చెప్పు అంకిత అని అంటుంది
అభిని మార్చుకునే బాధ్యత నాది ఆంటీ. ఒక్కసారి అభి మనసులో ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అంటే అది సాధించేవరకు వదిలిపెట్టాడు. ఒకసారి షేర్ మార్కెట్ విషయంలో కూడా ఇలాగే దెబ్బతిన్నాం. మరోసారి మన ఇద్దరం బాధపడడం అవసరమా అంకిత అని తులసి అంటుంది. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని తులసి అంకితను ఒప్పిస్తుంది. దూరంగా ఉన్నా కూడా మన ప్రేమలు, బంధాలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. దగ్గరగా ఉండి అభి మనసులో ఉన్న నిర్ణయం గురించి బాధపడటం కంటే కూడా మీరిద్దరూ అక్కడ ఉండి బాగుపడడం చాలా మంచిది. మీ లైఫ్ సెట్ అవ్వడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. అది నా మూలన ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళు అంకిత అని ఏడుస్తుంది తులసి. మొత్తానికి తులసి నిర్ణయానికి అంకిత ఒప్పుకుంటుంది. అంకిత అవి ఇద్దరూ కలిసే గాయత్రి తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు
శృతి బట్టలు ఆరవేస్తుండగా ప్రేమ్ వచ్చి నువ్వు కూర్చో శృతి. నేను బట్టలు ఆరేస్తా అని అంటాడు. ఆ మాట అనగానే ప్రేమ్ వైపు వింతగా చూస్తుంది శృతి. ఇది నీ వల్ల కాని పని అని అంటుంది. సరే అయితే ఒక బెట్ వేసుకుందాం. నేను ఓడిపోతే నీకు 10 ముద్దులు పెడతాను. నువ్వు ఓడిపోతే నాకు పది ముద్దు పెట్టు అని అంటాడు ప్రేమ్. బెట్ ఓడిపోతే గుంజీలు తీయాలి అని అంటుంది శృతి. ముందుగా చెప్పుకున్నట్టు ముద్దు కి ఓకే అంటే నేను బట్టలు అరవేస్తాను అంటాడు ప్రేమ్. సరే ఓకే అని అంటుంది శృతి అంటుంది. పాపం పిచ్చి శృతి ఎవరు ఓడిపోయినా ముద్దులు నాకే అని అర్థం కాలేదు అని మనసులో అనుకుంటూ బట్టలు అరేస్తడు. ప్రేమ్ ఓడిపోయాడో గెలిచాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం..