ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: నీ ముష్టి మాకవసరం లేదన్న పరంధామయ్య.. ప్రేమ్ ను పొమ్మన తులసి..!  

Share

Intinti Gruhalakshmi: తులసి ఫ్యాక్టరీ సీజ్ చేశారని తెలిసిన నందు.. ఇప్పుడు తెలుస్తుంది.. తులసికి ఇల్లు పోయింది.. ఫ్యాక్టరీ సీజ్ చేశారు.. కొడుకులు దూరమయ్యారు.. ఇప్పుడు ఎలా బ్రతుకుతుందో చూద్దాం.. అంటూ నందు లాస్య ముందు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తాడు.. తులసి అండ చూసుకునే కదా అమ్మానాన్నలు నా దగ్గరకు రాకుండా ఉంది. ఇప్పుడు తులసి వాళ్ళని ఎలా పోషిస్తుందో చూద్దాం అని అంటాడు.. ఇంట్లో కూర్చునేకంటే లైవ్ గా అక్కడికి వెళ్లి చూస్తేనే కదా అసలైన కిక్కు వచ్చేది అని లాస్య అంటుంది.. సరే ఇప్పుడే వెళ్దాం అంటాడు నందు..!

Intinti Gruhalakshmi: Serial 26 Apirl 2022 today episode Highlights
Intinti Gruhalakshmi: Serial 26 Apirl 2022 today episode Highlights

 

నందు, లాస్య తులసి బాధపడుతుంటే చూసి ఆనందించడానికి అక్కడికి వస్తారు. ఆ విషయం పసిగట్టిన పరంధామయ్య అనసూయమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. నేను మీ కొడుకుని ఇప్పుడు తులసి తో మీ ప్రయాణం చిల్లులు పడ్డ పడవ లాంటివి.. ఇకనైనా నాతో వచ్చేయండి అంటాడు. తులసి చేసిన తెలివి తక్కువ పనికి మీరెందుకు బాధపడటం అని నందు అంటాడు. అంతలో అభి వచ్చి ఫ్యాక్టరీ తీసుకునేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా మామ్.. ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో తెలుసా మామ్ నీకు అంటూ తులసి యాంటిగా మాట్లాడతాడు. వీళ్ళందరి మాటలకు అడ్డుకట్ట వేయడానికి ప్రేమ్ సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు..

మూతబడ్డ ఫ్యాక్టరీ ఆదాయంతోనే కదా అమ్మ అందరి కష్టాలు తీర్చి.‌. ఇన్ని రోజులు నుంచి మనందరికీ అన్నం పెట్టింది అని ప్రేమ్ పంచాంగం మొదలు పెడతాడు. ఇప్పుడు అరుస్తున్న నోర్లు అప్పుడు ఏమయ్యాయి అని అడగావెంటి అమ్మ.. నందునీ చూస్తూ మీరు మీ ఆవిడ ఉద్యోగం లేక నెలలు తరబడి కాళీగా తిని కూర్చున్నప్పుడు.. మిమ్మల్ని పోషించడానికి అమ్మకి ఫ్యాక్టరీ డబ్బులే కదా.. అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు నోర్లు లెగుస్తున్నాయి.. సమాధానం చెప్పండి అంటూ ఆ ప్రేమ్ నిలదీస్తాడు. అవసరాల్లో ఒకలా అవసరం లేనప్పుడు మరోలా బిహేవ్ చేస్తారు. రేయ్ ప్రేమ్ నీకు అవసరం లేని విషయాల్లో నువ్వు కల్పించుకోకు అని తులసి అంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.. లేకపోతే జీవితంలో ఇంకొకసారి నీ మొఖం చూడను అని ప్రేమ్ తో అంటుంది తులసి. ఇక ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi: Serial 26 Apirl 2022 today episode Highlights
Intinti Gruhalakshmi: Serial 26 Apirl 2022 today episode Highlights

నా మీద కోపం వాడి మీద చూపించావని నాకు అర్థం అవుతుంది తులసి అని నందు అంటాడు. ఇలా పొగరుగా మాట్లాడబట్టే అందరికీ నువ్వు దూరం అవుతున్నావు ముందు అది తెలుసుకో అంటాడు.. అత్తయ్య మావయ్య ను మేము కాదని ఈ ఇంట్లో నుంచి వెళ్లడానికి కారణం నువ్వు అని లాస్య అంటుంది. ఇంత జరిగినా మా అమ్మానాన్న నాతో రారు. వాళ్లు నాతో రాకపోయినా నేను నెలల వాళ్ళకి కొంత డబ్బు పంపిస్తాను అని నందు అంటాడు.. నందు నువ్వు వేసే ముష్టి మాకు అవసరం లేదు.. మేము చనిపోయాక దహన సంస్కారాలకు కూడా నువ్వు మాకు డబ్బు ఖర్చు పెట్టవద్దు అని వాళ్ల నాన్న అంటాడు. అలా చేస్తే మేము నరకానికి పోతాము. ఈ రోజుతో మన బంధం తెగిపోతుంది అనుకో అని వాళ్ళ అంటుంది.. ఎప్పుడైతే నువ్వు మీ నాన్న ఆపరేషన్ కి ఇవ్వాల్సిన డబ్బులు తప్పించుకుని పరిపోయావో అప్పుడే మన బంధం తెగిపోయింది. సరిగ్గా చెప్పావు అనసూయ. ఇక్కడినుంచి వెళ్లిపోండి. అరేయ్ నందు ఒకటి చెప్తాను వినండి. తులసి ది పొగరు కాదు. ఆత్మాభిమానం అలాంటివి నీకు మీ ఆవిడకి లేవు కాబట్టి అవి తెలియవు. అరెయ్ అభి నీకు కూడా డాకె మీ అత్తారింటి నీళ్లు బాగా పడ్డట్టు ఉన్నాయి మీ అమ్మ ముందు గొంతు బాగా లెగుస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అభి అంటాడు వాళ్ల తాతయ్య. మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటగా అని నందు, లాస్య ను చూస్తూ అంటుంది అనసూయమ్మ.


Share

Related posts

IPL 2021: కేకేఆర్ టీమ్ లో కరోనా కలకలం.. కేకేఆర్ VS ఆర్సిబి మ్యాచ్ వాయిదా..!!

bharani jella

బ్రేకింగ్: ప్రముఖ కమెడియన్ కన్నుమూత

Vihari

నాగ శౌర్య సినిమాలో రకుల్ ప్రీత్ .. డామినేట్ చేస్తుందంటున్న ఫ్యాన్స్ ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar