కొన్ని సినిమా పేర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంటాయి. బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ సినిమా టైటిల్ ఇప్పుడు అలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. తొలి చిత్రం `దఢక్`తో ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న జాన్వీకపూర్, వైవిధ్యంగా తన రెండో సినిమాగా బయోపిక్‌ను ఎంచుకున్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికుల వైద్య సేవల కోసం పాటపడ్డ లేడీ ఐ.ఎ.ఎఫ్ అధికారిణి గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో జాన్వీకపూర్ నటించబోతున్నారు. ఈ సినిమాకు `కార్గిల్ గర్ల్` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని సినీ వర్గాల సమాచారం. ఈ పాత్ర కోసం జాన్వీకపూర్ .. మహిళా ఐ.ఎ.ఎఫ్ అధికారి గుంజన్ సక్సేనాను కూడా కలుసుకుని కొన్ని వివరాలు సేకరించారు. ఇటీవలే ఈ సినిమాకు షూటింగ్‌ను అహ్మదాబాద్‌లో స్టార్ట్ చేశారు.
previous post
next post