Khiladi: మాస్ మహారాజా రవితేజ సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎక్కువ శాతం ఉండేది మాత్రం మాస్ ఆడియన్స్. పక్కా మాస్ ఎంటర్‌టైనర్స్ సినిమాలు చేయడంలో రవితేజ ముందుంటాడు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరుసగా మాస్ రాజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయేసరికి పవర్ లాంటి పోలీస్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను ఎంచుకున్నాడు. అదే క్రాక్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది.

దర్శకుడు గోపీచంద్ మలినేని మేకింగ్, రవితేజ పర్ఫార్మెన్స్, థమన్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కలిసి క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడానికి కారణమయ్యాయి. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ ఫుల్ ఫాంలోకి వచ్చాడు. వరుసగా తన మార్క్ స్టైల్లో సాగే కథలను ఎంచుకుంటున్నాడు. అలాగే ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. అలా చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఖిలాడి. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న రకాల పాత్రల్లో నటిస్తుండగా, రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫైనల్ షూట్‌లో భాగంగా చివరి సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు.
Khiladi: మాస్ పెప్పీ సాంగ్ అట్టా సూడకే అనే సాంగ్ రిలీజ్..
కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్, గ్లింప్స్ వచ్చి భారీ స్థాయిలో అంచనాలు పెంచగా..ఇప్పుడు మాస్ పెప్పీ సాంగ్ అట్టా సూడకే అనే సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రవితేజ, మీనాక్షి చౌదరీలపై ఈ సాంగ్‌ను షూట్ చేశారు. వి జె శేఖర్ మాస్టర్ మాంచి మాస్ స్టెప్పులను కంపోజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతూ భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అనసూయ, అర్జున్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు.