సినిమా

NTR 30: పాన్ ఇండియా పదమే నచ్చదు.. ఎన్టీఆర్ మూవీపై కొరటాల షాకింగ్ కామెంట్స్‌!

Share

NTR 30: ` మిర్చి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో ద‌ర్శ‌కుడిగా సినీ గ‌డ‌ప తొక్కిన కొర‌టాల శివ‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది త‌క్కువ సినిమాలే అయినా అప‌జయం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా అన‌తి కాలంలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న `ఆచార్య` సినిమాతో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విజృతంగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. అయితే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా కొర‌టాల శివ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ అయిన `ఎన్టీఆర్ 30`పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `ఆర్ఆర్ఆర్‌` త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్ర‌మిది.

another star hero in ntr 30

నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, క‌ళ్యాణ్ రామ్ క‌లిసి హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. గ‌త ఏడాది స‌మ్మ‌ర్‌లోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్ర‌క‌టించ‌గా.. ఈ జూన్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి.

అయితే ఆచార్య‌ను ప్ర‌మోట్ చేసేందుకు కొర‌టాల ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా.. అక్క‌డ ఆయ‌న‌కు `ఎన్టీఆర్ 30` క‌థ పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుందా..? ` అనే ప్ర‌శ్న ఎదురైంది. దానికి కొర‌టాల బ‌దులిస్తూ.. `నాకు పాన్ ఇండియా అనే పదమే నచ్చదు. పాన్ ఇండియా కోసం ఒకలా .. అలా కాకపోతే మరోలా కథలు రాయను. బలమైన కథాకథనాలతో రాస్తే అందరూ తప్పకుండా చూస్తారు. అలాంటి ఓ మంచి కథనే ఎన్టీఆర్ కోసం రాశాను. అంది అంద‌రికీ న‌చ్చుతుంది` అంటూ చెప్పుకొచ్చారు. ఈయ‌న కామెంట్స్‌తో `ఎన్టీఆర్ 30`పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

 


Share

Related posts

ఆచార్యలో ఆ ఒక్క సెట్ కోసమే 4 కోట్లు ఖర్చు చేశారట..!

siddhu

Pawan Kalyan: పిచ్చకోపం గా ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ !

sekhar

బిగ్ బాస్ 4 : గంగవ్వ విశ్వరూపం..! కోపంతో ఆ కంటెస్టెంట్ చెంప చెళ్ళుమనిపించింది…?

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar