బ్యాక్ టు వ‌ర్క్ అంటున్న మ‌హేశ్‌


టాలీవుడ్ స్టార్ హీరోల్లో మ‌హేశ్ స్టైలే వేరు.. ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో క‌లిసి టూర్స్ వెళుతుంటాడు. ప్ర‌స్తుతం ద‌స‌రా సెల‌వుల‌ను కూడా ఈ హీరో ఇలాగే త‌న కుటుంబంతో క‌ల‌సి ఎంజాయ్ చేశాడు. భార్య న‌మ‌త్ర‌, కొడుకు గౌత‌మ్‌,, కుమార్తె సితార‌తో క‌లిసి స్విజ‌ర్లాండ్ ట్రిప్‌కు వెళ్లాడు. ట్రిప్‌లో విష‌యాల‌ను ఎప్ప‌టిక ప్పుడు పోస్ట్ చేస్తూ వ‌చ్చిన మ‌హేశ్‌.. స్విజ‌ర్లాండ్ నుండి ఇండియాకు తిరుగు ప్ర‌యాణ‌మైన సంద‌ర్భంలోనూ మెసేజ్ చేశాడు. బ్యాక్ టు వ‌ర్క్ అండ్ స్కూల్ అంటూ కుమారుడు గౌత‌మ్‌తో ఉన్న పొటోను పోస్ట్ చేసిన మ‌హేశ్‌, న‌మ‌త్ర‌తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేశాడు. ప్ర‌స్తుతం మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా తుది చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోవాల్సి ఉంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నారు. అనీల్ రావిపూడి ద‌ర్శ‌కుడు.