టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గతంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన మహేష్ స్టోరీ ఎంచుకునే విషయంలో ఇటీవల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్ ఏదైనా స్టోరీ ఓకే చేస్తే కచ్చితంగా ఆ స్క్రిప్టు లో సరైన కంటెంట్ ఉంటుందని ఇండస్ట్రీ మొత్తం డిసైడ్ అయిపోతుంది. గతంలో ఓకే చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా గాని మహేష్ తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నాటి నుండి మహేష్ గెటప్ డిఫరెంట్ గా ఉండటంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు సినిమా పై వైరల్ అవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ బాబు ఈ సినిమా ద్వారా అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వటానికి రెడీ అయినట్లు, మొట్టమొదటిసారి మహేష్ బాబు డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో కన్నింగ్ నేచర్ తో నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కలిగి ఉంటాడని, మరొక క్యారెక్టర్ క్లాస్ అండ్ సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటుందని సమాచారం. ఈ వార్త తాజాగా బయటకు రావడంతో మహేష్ అభిమానులు సింగల్ గా సిల్వర్ స్క్రీన్ పై అనేక రికార్డులు కొల్లగొట్టాడు. ఇక డబల్ రోల్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ కి నాంది అని కామెంట్ చేస్తున్నారు.