మ‌హేష్ కొత్త ఆలోచ‌న‌

హీరోగా సూప‌ర్‌స్టార్ రేంజ్‌కు ఎదిగిన మ‌హేష్ నెమ్మ‌దిగా హీరోగానే కాకుండా సినిమాకు సంబంధించిన ఇత‌ర రంగాల్లో కూడా కాలు పెడుతున్నాడు. రీసెంట్‌గా జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పెట్టి నిర్మాత‌గా కూడా మారారు. ఇప్పుడు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే త‌న త‌దుప‌రి చిత్రానికి నిర్మాణంలో భాగ‌స్వామిగా మారాడు. అయితే సినిమా నిర్మాణ వ్య‌యంలో భాగం తీసుకోవ‌డం లేదు. త‌న రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా సినిమా నిర్మాణంలో బాగ‌స్వామి అయ్యాడు. సినిమా వ్య‌య‌మంతా అనీల్ సుంక‌ర‌దే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుద‌ల్లో వ‌చ్చినదంతా ఆయ‌న‌దే అయితే.. మిగిలిన సినిమా ప్రొడ‌క్ష‌న్‌లో మేజ‌ర్ పార్ట్ మహేష్ రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కుల‌తో పాటు హిందీ అనువాద హ‌క్కుల‌ను త‌న చేతిలోనే ఉంచుకున్నాడు. వ్య‌వ‌హారం చూసిన వాళ్లంద‌రూ మ‌హేష్ చాలా తెలివిగా ముందుకెళుతున్నాడని అనుకుంటున్నారు.