“మనసు పలికే మౌన ప్రేమ” నూతన చిత్ర ప్రారంభోత్సవం

Share

“మనసు పలికే మౌన ప్రేమ” నూతన చిత్ర ప్రారంభోత్సవం
ఏ ఎస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై  బాబీ వేంపల్లి దర్శకత్వంలో  నిర్మాత బొట్రేపల్లి ఆవుల కుంట్ల సూర్య ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం ‘మనసు పలికే మౌన ప్రేమ’ ఈ నూతన చిత్ర పూజా కార్యక్రమం గురువారం ఉదయం ఫిలిం నగర్ లో ఘనంగా జరుపుకుంది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, గౌరవ దర్శకత్వం కె ఎస్ నాగేశ్వర రావు వహించారు. అనంతరం నిర్మాత మరియు స్క్రిప్ట్ రైటర్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ మా ‘మనసు పలికే మౌన ప్రేమ’  చిత్రం యొక్క పూజా కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి నేనే స్క్రిప్ట్ అందించడం జరిగింది. రాయలసీమ అంటే కేవలం ఫాక్షన్ కాదు.. ప్రేమ కూడా ఉంటుందని తెలిపే ఫ్రెష్ లవ్ స్టోరీ. 1980 లో రాయలసీమ విల్లెజ్ బ్యాక్ డ్రాప్ లో  కథ తెరకెక్క నుంది. ఎంత బడ్జెట్ అయినా సరే ఈ సినిమాను పూర్తిఐ  చేసి తీరాలని నిర్ణయించుకున్నాను. ఈ స్టోరీ నేను చెప్పినప్పుడే నా స్నేహితుడు బాబీ ఎగ్జైట్  అయ్యి సినిమా చేద్దామని తాను డైరెక్షన్ బాధ్యతను తీసుకున్నారు. ఈ నూతన చిత్రానికి ఇంకా ఆడిషన్స్ జరుగుతున్నాయి అవి ముగిసిన వెంటనే..  జనవరి 18 తేదీనుంచి రెగ్యులర్ షూట్ ను ప్రారంభించి మూడునెలల్లో షూట్ పూర్తి చేసి వీలైతే స్వయంగా విడుదల చేస్తామని తెలియపరిచారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ.. విల్లేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.. స్టోరీ చాలా బాగా రాసుకున్నారు సూర్య  గారు. అతను నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పుకొచ్చారు. హీరో నందు మాట్లాడుతూ.. మంచి లవ్ స్టోరీ.. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ మాత్రమే కాదు ప్రేమ కూడా అద్భుతంగా ఉంటుందని తెలిపే స్టోరీ.. టైటిల్ ఎంత బాగుందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది. హీరో గా పరిచయం అవుతున్నాను ఆదరిస్తారని ఆశిస్తున్నాని అన్నారు. నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. కేవలం లవ్ స్టోరీనే కాదు ఫ్యామిలీ మొత్తం కలసి చూసేలా  సినిమా ఉంటుంది అని హీరోయిన్ ప్రియా తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొని తమ అభినందనలను, అభిప్రాయాలను పంచుకున్నారు.
నందు,ప్రియా, బాబా కల్లూరి, మేరిగ వీరబాబు, అజిత్ బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమరా మెన్: కుమారన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: గుర్రం కొండా రెడ్డి బాషా, స్క్రీన్ ప్లే -మాటలు- దర్శకత్వం: బాబీ వేమల్లి, కథ- నిర్మాత: బట్రేపల్లి ఆవుల కుంట్ల సూర్య ప్రకాష్.

Share

Related posts

A – ఆదిపురుష్ : టీం క్లారిటీ.. అవన్ని అవాస్తవాలంటూ కొట్టిపారేశారుగా ..?

GRK

రెడ్ ట్రైలర్ చూసి రాం కి ఇండస్ట్రీ హిట్ పక్కా అని ఫిక్సవుతున్న ఫ్యాన్స్ ..!

GRK

Jr.NTR – Akhil : జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ పనికి అందరూ నవ్వుకుంటున్నారు.. వీడియో వైరల్ చేసిన వర్మ..

bharani jella

Leave a Comment