సినిమా

Manchu Lakshmi: కుర్ర హీరోతో డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మంచు లక్ష్మి.. వీడియో వైర‌ల్‌!

Share

Manchu Lakshmi: మంచు లక్ష్మి.. ఈమె గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు వార‌సురాలిగా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు ల‌క్ష్మి.. చేసింది త‌క్కువ సినిమాలే న‌టిగా మంచి మార్కులు వేయించుకుంది. కానీ, స‌రైన హిట్లు ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల స్టార్ హోదాను మాత్రం ద‌క్కించుకోలేక‌పోయింది.

అయితే బుల్లితెర‌పై ప‌లు షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈమె ప్ర‌స్తుతం తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌తీక్ ప్ర‌జోష్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ఇటీవ‌లె ప్రారంభ‌మైంది. అలాగే మంచు లక్ష్మి మ‌ల‌యంలోనూ రెండు చిత్రాల్లో న‌టిస్తోంది.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మి.. తాజాగా ఓ కుర్ర హీరోతో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు సిద్ధు జొన్నలగడ్డ. ఈ మ‌ధ్య ఈయ‌న `డీజే టిల్లు` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఈ సినిమాలో బాగా పాపుల‌ర్ అయిన `టిల్లు అన్నా డీజే పెడితే..` పాట‌కు మంచు ల‌క్ష్మి హీరో సిద్దు, అమన్ ల‌తో క‌లిసి ఊరమాస్‌ స్టెప్పులేసి అద‌ర‌గొట్టింది. ఆపై ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా.. అది కాస్త నెటిజ‌న్లు ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంకెందుకు ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.


Share

Related posts

పూజా హెగ్డే క్రేజ్ కి అంతులేకుండా పోతుంది ..!

GRK

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ..!!

sekhar

దెయ్యం పాత్ర‌లో జాన్వీ

Siva Prasad