NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రెండో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “RRR”తో ప్రపంచ స్థాయిలో మంచి ఇమేజ్ సంపాదించుకున్న తారక్.. కొరటాలతో చేయబోయే ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళితో చేసిన తరువాత వరుస పరాజయాలు పలకరించే ప్రమాదం గతంలో సంభవించడంతో తన 30వ సినిమాకీ అటువంటి డ్యామేజ్ జరగకూడదని కథ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగిందట.

వాస్తవానికి ఈ సినిమా 2020లోనే అధికారికంగా ప్రకటించడం జరిగింది. కానీ కరోనా దాపరించడంతో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు దాదాపు 2022 ప్రారంభం వరకు సినిమా ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కోవటంతో షూటింగ్ లాగిపోవడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. కానీ గత ఏడాది “RRR” రిలీజ్ అయ్యాక సూపర్ డూపర్ హిట్ అయ్యాక వెంటనే కొరటాల ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నెల 23వ తారీకు ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు స్టార్ట్ కానున్నాయట. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేస్తే మే లో స్వర్గీయ నందమూరి తారకరామారావు 100వ జయంతి సందర్భంగా “NTR 30” ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా చిన్నపాటి వీడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో “జనతా గ్యారేజ” సూపర్ డూపర్ హిట్ కావడంతో వస్తున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా “అమిగోస్” ప్రీ రిలీజ్ వేడుకలో కొరటాల సినిమా గురించి అభిమానులకు ఆప్ డేట్ ఈ నెలలో ఉండబోతున్నట్లు తారక్ మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగానే ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ కావటం విశేషం.