Vaishnav Tej- Uppena Collections : మెగా కాంపౌండ్ నుంచి తొలిసారిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో వైష్ణవ తేజ్. వైష్ణవ్ ఏ ముహూర్తాన “ఉప్పెన” సినిమా ప్రారంభించారో కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్ల పరంగా కోట్లకు కోట్లు వసూలు చేస్తోంది. మొదటి సినిమాతోనే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ మెగా హీరో సినిమా మంచి విజయవంతం కావడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ సినిమా ఏకంగా 70 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.ఓ డెబ్యూ హీరో సినిమాకు ఈ మేరకు కలెక్షన్స్ రావడం రికార్డ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఆ విజయాలన్నింటిని వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా బ్రేక్ చేసిందని చెప్పవచ్చు. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఉప్పెన సినిమా 49 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇది వరకు ఫిబ్రవరి నెలలో విడుదలైన అన్ని సినిమాలలో కల్లా ఈ సినిమా ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టి రికార్డును బద్దలు కొట్టింది. 2017 లో నాని నటించిన నేను లోకల్ సినిమా 35 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. అదేవిధంగా 2015 లో ఎన్టీఆర్ టెంపర్ ఫిబ్రవరి నెలలోనే విడుదల అయింది .ఈ సినిమా 44.4 కోట్ల రూపాయలు వసూలు చేయగా, 2013 లో విడుదలైన ప్రభాస్ మిర్చి 48.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ లెక్కన చూస్తే వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా అధిక వసూళ్లను కలెక్షన్ చేస్తుందనీ తెలుస్తోంది.
మా వైష్ణవ్ తేజ్ తోపు:
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలను బ్రేక్ చేస్తూ రికార్డు బద్దలు కొట్టాడు. దీంతో మా వైష్ణవ్ తేజ్ తోపు… అంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వైష్ణవ్ మరొక రెండు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటే వైష్ణవ్ కూడా టాప్ హీరోల లిస్టులో చేరిపోతాడు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు, మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఉప్పెన సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో బుచ్చిబాబు, వైష్ణవ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా నిలిచారు.