Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు విజయవంతంగా చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధినేతగా దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వెండితెరకు దూరం అవ్వడం జరిగింది. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు పొలిటికల్ గా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మొట్ట మొదటి సారి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు.
అయినా కానీ ఎక్కడ నిరుత్సాహం చెందకుండా ప్రజల తరఫున పోరాడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది “వకీల్ సాబ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో తెలంగాణ భాషలో అభిమానులను ఎంతగానో అలరించడం జరిగింది. ఒక ఈ సినిమాలో మాత్రమే కాక గతంలో అనేక సినిమాలలో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాస ద్వారా డైలాగులు చెబుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
ఒక తెలంగాణ యాస మాత్రమే కాక శ్రీకాకుళం యాస లో కూడా పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఫ్యాన్స్ కి రాయలసీమ టచ్ ఇవ్వడానికి పవన్ రెడీ అయినట్లు టాక్. మేటర్ ఏమిటంటే రానాతో చేస్తున్నా మల్టీ స్టారర్ సినిమాలో.. పవన్ కళ్యాణ్ కర్నూలు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా..పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు, దీంతో పక్కా రాయలసీమ భాషలో సినిమాలో డైలాగులు పవన్ కళ్యాణ్ పలక బోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.