Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడవలసిన పనిలేదు. మహేష్ అంటే తన అభిమానులకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. మన సూపర్ స్టార్ ని ప్రిన్స్ అని, టాల్ అండ్ హేండ్సమ్ అని పిలుచుకునే తన అభిమానులు, ఎవరన్నా తన అభిమాన హీరో గురించి తప్పుగా మాట్లాడితే తాట తీసేస్తారు. అది ఎవరైనా వదిలిపెట్టరు. అది హీరోయిన్ అయినా మొహమాట పడరు. ఇక అసలు విషయానికొస్తే, హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబును అగౌరవ పర్చే విధంగా ఉన్నాయంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Mahesh Babu: మహేష్ త్రివిక్రమ్ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్..??
Mahesh Babu: ఏమిటి విషయం?
స్టార్ డమ్ లో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు విషయంలో పూజా హెగ్డే వ్యవహరించిన తీరు అయన అభిమానులను బాధించింది. అలాగే పూజ ఉపయోగించిన భాష ఏమాత్రం సమంజసం గా లేదని మహేష్ అభిమానులు ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ను గౌరవం లేకుండా సంబోధించింది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది.
Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మహేష్ కి విలన్ గా అ హీరో ?
విషయం ఇదే..
ఈ మధ్య ఓ సందర్భంలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. “ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమాను చేస్తున్నాను.. అది గతంలోనే ప్రకటించడం జరిగింది.” అనే వ్యాఖ్యలు చేసింది. అక్కడే వచ్చింది అసలు చిక్కు. సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోయిన్ పూజా హెగ్డే కనీసం గౌరవం లేకుండా మాట్లాడటం ప్రిన్స్ అభిమానులకు ఎంతమాత్రమూ నచ్చలేదు. సర్ అని లేదా గారు అని మహేష్ బాబును ఆవిడ సంబోధిస్తే అసలు ప్రాబ్లెమ్ వచ్చేది కాదు. కాని పూజా హెగ్డే ఏక వచనంతో సంబోధించడంతో విషయం ఎక్కడిదాకా వెళ్తుందో.