Prema Desam: 1996వ సంవత్సరంలో ఆగస్టు నెలలో రిలీజ్ అయిన “ప్రేమదేశం” సినిమా అనేక సంచలనాలు సృష్టించింది. అబ్బాస్, వినీత్ కలిసి నటించిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో టబు నటించడం జరిగింది. అప్పట్లో తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయి అనేక భాషల్లో కూడా అదే స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాతో అబ్బాస్ కి వినీత్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం చాలా కాలం నుండి సినిమాలు చేయడం లేదన్న సంగతి తెలిసిందే.
అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. వినీత్ ఇంకా సినిమా అవకాశాల కోసం సినిమా ఫీల్డ్ లోనే తిరుగుతూ ఉన్నాడు. గతంలో రుక్మిణి ఆరోప్రాణం మరికొన్ని సినిమాలు తెలుగులో చేసిన వినీత్.. రజనీకాంత్ నటించిన “చంద్రముఖి” లో కీలక పాత్ర చేయడం జరిగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ అడపాదడపా అవకాశాలు అందుకుంటూ ఇటీవల నితిన్ నటించిన ‘రంగ్ దే’ సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో వరుసపెట్టి సినిమాలు వినీత్ దగ్గరికి వస్తున్నాయి.
Read More: సినిమాలు ఎందుకు చేయడం లేదు చెప్పిన అబ్బాస్..!!
వీటిలో చాలావరకు ప్రతిష్టాత్మకమైన స్టార్ హీరోల సినిమాలు అన్ని ఫిలిం వర్గాలలో టాక్. వినీత్ కి తెలుగు భాషపై పట్టు ఉండటంతో చాలా మంది స్టార్ డైరెక్టర్లు వినీత్ కి కీలక పాత్రలు క్యారెక్టర్ కి మంచి డిమాండ్ ఉండే అవకాశాలు ఇస్తున్నట్లు ఫిలిం వర్గాల టాక్. ఇదిలా ఉంటే ‘రంగ్ దే’ లో చాలా కాలం తర్వాత వినీత్ కనబడినా గాని ఆయనలో పెద్దగా మార్పు లేదని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. కాగా ప్రస్తుతం ‘రంగ్ దే’ ఎఫెక్టుతో వినీత్ కి మళ్లీ అవకాశాలు రావడంతో.. తెలుగు ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.