సినిమా

Samantha: సమంతపైనే భారం మోపుతున్న నిర్మాతలు.. నయన తార ఇమేజ్ ఆ సినిమాకి పనికి రాదా?

Share

Samantha: మెగా హీరోలు నటించిన ఆచార్య ఈనెల 29న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే మన థియేటర్లలలో పాన్ ఇండియా చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్-2 తన హవా కొనసాగిస్తున్నాయి. ఆల్మోస్ట్ థియేటర్లు అన్ని ఈ 2 సినిమాలకే కేటాయించారు. 28 వరకూ ఈ సినిమాలకు ఎలాంటి ఢోకా లేదు. ఇక 29న ఆచార్య వస్తుంది కాబట్టి కొన్ని థియేటర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఏదిఏమైనా ఈ రెండు సక్సెస్ ఫుల్ సినిమాల నుంచి కొంత పోటీ ఆచార్య`కి తప్పేటట్టు లేదు. ఇంత టఫ్ కాంపిటీషన్ మధ్య సమంత నటించిన తమిళ అనువాద చిత్రం `కాతు వాకుల రెండు కాదల్ 28న రిలీజ్ అవుతుంది.

Producers are putting the burden on Samantha ..
Producers are putting the burden on Samantha ..

Samantha: సమంత ఛరీష్మా పనికొస్తుందా?

విశ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతారతో పాటు సమంత కూడా ఈ చిత్రంలో నటించిన సంగతి తెలిసినదే. విజయ్, నయన్ ఇమేజ్ తో తమిళ్ లో సినిమా నెట్టుకొచ్చేస్తుంది అనుకుంటే, మిగతా భాషల్లో ఈ సినిమా పరిస్థితి అర్ధం కావడం లేదు. ముఖ్యంగా మన తెలుగులో సమంత ముఖాన్ని చూసి ప్రేక్షకులు వెళతారనుకుంటే, ఆచార్య సినిమా నెక్స్ట్ డే రిలీజుకి వుంది. ఈ రకంగా తెలుగు రిలీజ్ పరిస్థితి మాత్రం కాస్త ఇబ్బంది కరంగానే కనిపిస్తుంది. ఈ సినిమాకి థియేటర్లు అతికొద్ది సంఖ్యలోనే దొరుకుతాయి. విజయ్-నయన్ లకు ఇక్కడ అంత క్రేజ్ లేదు కాబట్టి ఆ బాధ్యతల్ని సమంత తీసుకోవాల్సి ఉంటుంది.
<img src=”https://newsorbit.com/wp-content/uploads/2022/04/IMG_20220425_151637_716.jpg” alt=”” width=”589″ height=”458″ class=”alignnone size-full wp-image-245811″ /

సమంత ఛరీష్మా ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించగలదా?

ఇకపోతే ఇంత వరకూ ఈ సినిమాకి సంబంధించి సరైన ప్రచారం జరగలేదు. ఇంకా రిలీజ్ కి నాలుగు రోజులే సమయం ఉంది. ఈ గ్యాప్ లో సమంత ఇమేజ్ తో బజ్ తీసుకురాగలగాలి. ఓబేబి లాంటి సక్సెస్ తో సమంత సత్తా బయటపడింది. మళ్లీ ఇప్పుడు అంతటి క్రేజ్ తోనే తెలుగు ఆడియన్స్ ని థియేటర్లకి రప్పించాలి. ఆమెకు తోడుగా నయన్ కొంత వరకూ సపోర్ట్ గా ఉంటుంది. ఏది ఏమైనా నిర్మాతలు మాత్రం సమంత పైనే అధిక భారం వేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం సమంత శాకుంతంలం..`యశోద` లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.


Share

Related posts

Samantha: సమంత ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న స్టార్ హీరోయిన్..??

sekhar

కియారా అద్వాని, కీర్తి సురేష్.. ఈ ఇద్దరి విషయంలో పెద్ద కన్‌ఫ్యూజన్.. ప్రభాస్ తేల్చుకోలేకపోతున్నాడా ..?

GRK

Neha Malik At Nakodar Darbar Photos

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar