RRR: “RRR” ఇండియాలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. “బాహుబలి 2” విజయంతో అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి ఈ సినిమాతో మరోసారి సత్తా చాటారు. “బాహుబలి 2” ఇండియాలో అన్ని ఇండస్ట్రీల రికార్డులు బ్రేక్ చేసి ఆల్ టైం హిట్ గా నిలిచింది. “RRR” కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. కానీ “బాహుబలి 2” కంటే ఎక్కువ “RRR”కి రాజమౌళి మంచి పేరు సంపాదించారు. కారణం చూస్తే “RRR”…చాలా ఓటిటి ప్లాట్ ఫామ్ లలో అంతర్జాతీయంగా చాలామందిని ఆకర్షించింది.
ఏకంగా ఆస్కార్ నామినేషన్ లకి కూడా సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విజయంతో ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ సినిమా వారోత్సవాలకు రాజమౌళికి ప్రత్యేకమైన ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి సినిమాల ప్రదర్శనలకు విదేశాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదంతా పక్కన పెడితే “RRR” సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజమౌళి పడ్డ ఓ ఇబ్బందిని గురించి తాజాగా హీరోయిన్ శ్రియ బయట పెట్టింది. విషయంలోకి వెళ్తే “RRR” సినిమాకి ముందు రాజమౌళి హెల్త్ పరంగా ఇబ్బందులు పడ్డారని తెలిపింది. తనకు తెలిసినంతవరకు ఆస్తమాతో ఇబ్బంది పడుతూనే “RRR” సినిమా కంప్లీట్ చేయడం జరిగిందని పేర్కొంది.
ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్న టైములో సెట్ మొత్తం కంప్లీట్ దుమ్ముతో నిండిపోయినప్పటికీ.. ఆయన ధ్యాస మొత్తం సినిమా పైనే ఉందని శ్రియ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో శ్రియ… అజయ్ దేవగన్ భార్యగా కీలకపాత్రలో నటించింది. ఈ క్రమంలో శ్రియ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే “RRR” జపాన్ దేశంలో గత నెల రిలీజ్ అయి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది.