Mahesh Rajamouli: ఇండియన్ గ్రేట్ ఎక్కడికి దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో త్వరలో మహేష్ హీరోగా సినిమా స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2, RRR తో తన డైరెక్షన్ దమ్ము ఏంటో ఇండియన్ బాక్సాఫీస్ కి రుచి చూపించటం జరిగింది. దీంతో ఇప్పుడు మహేష్ బాబు ప్రాజెక్టు పై అందరి దృష్టి ఏర్పడింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2, RRR సినిమాల బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ తో… మహేష్ ప్రాజెక్టు తెరకెక్కుతున్నట్లు గతంలోనే రాజమౌళి తెలియజేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కీలకమని లేటెస్ట్ టాక్ నడుస్తోంది. దీంతో మహేష్ బాబుకి ధీటుగా స్ట్రాంగ్ విలన్ పాత్రలో… బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోని రాజమౌళి .. సెలక్ట్ చేసుకున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ విదేశీ పర్యటనలో ఉన్నారు. జూన్ నెలలో తిరిగి ఇండియాకి రాబోతున్నారు. ఇండియాకి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
ఈ ఏడాది మొత్తం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది జనవరి నుండి రాజమౌళి ప్రాజెక్ట్ లో మహేష్.. ఏకధాటిగా పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు టాక్. అంతమాత్రమే కాదు త్రివిక్రమ్ తర్వాత రాజమౌళి ప్రాజెక్టుల మినహా మరే ప్రాజెక్టు ఇప్పుడప్పుడే ఓకే చేయకూడదని మహేష్ డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మిగతా ప్రాజెక్టులు ఒప్పుకోవాలని మహేష్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. మే 31 వ తారీకు కృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో రాజమౌళి సినిమా కి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.